
రిజర్వేషన్ల పెంపుపై కదం
సాక్షి బళ్లారి: ప్రభుత్వం అశాసీ్త్రయంగా ఎస్సీలకు అంతర్గత రిజర్వేషన్లు కల్పించడంతో వడ్డె, లంబాణి, కొరిచే, కొరమ కులాలకు అన్యాయం జరిగిందని నిరసిస్తూ ఆ వర్గాలకు చెందిన జనం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని ఖండిస్తూ ఎస్సీ రిజర్వేషన్ సంరక్షణ ఐక్య కూటమి ఆధ్వర్యంలో నగరంలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ నుంచి వేలాది మంది ఆ వర్గాలకు చెందిన జనం పాల్గొని ర్యాలీని చేపట్టారు. రాయల్ సర్కిల్ మీదుగా జిల్లాధికారి కార్యాలయానికి చేరుకొన్నారు. ఎస్సీ కులాల రిజర్వేషన్ సంరక్షణ ఐక్య వేదిక ప్రముఖులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అశాసీ్త్రయంగా రిజర్వేషన్లను పెంచడంతో ఎస్సీ వర్గాలకు చెందిన కులాలకు అన్యాయం జరిగిందన్నారు.
తీవ్ర అన్యాయం జరిగింది
ఎస్సీల్లో అంతర్గత రిజర్వేషన్లు పెంచడం ద్వారా తమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తమ కులాలకు 4.5 శాతం రిజర్వేషన్ కల్పించిందన్నారు. ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. సిద్ధరామయ్య ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. ఆయా కులాలకు చెందిన ప్రముఖులు రామాంజి, మహేష్, రమణప్ప, రామానాయక్, తిమ్మానాయక్, తదితరులు పాల్గొన్నారు.