
పూడిక మేట.. డ్యాములకు కోత
బనశంకరి: తుంగభద్ర డ్యామ్‌తో పాటు రాష్ట్రంలోని ప్రముఖ 12 జలాశయాల్లో ఏటేటా పై నుంచి నీటితో పాటు ఒండ్రు మట్టి, బురద వచ్చి పేరుకుపోతోంది. ఈ పూడిక క్రమేణా పెరుగుతున్నట్లు జలవిజ్ఞాన శాఖ సర్వేలో వెల్లడైంది. దీనివల్ల ప్రజలకు, రైతులకు అందాల్సిన తాగు, సాగునీటికి గండిపడుతోంది. విలువైన నీరు వృథా అవుతోంది. జాతీయ మార్గదర్శకాల ప్రకారం జలాశయాల నీటినిల్వ సామర్థ్యంలో 3 శాతం పూడిక ఉండవచ్చు. తుంగభద్ర డ్యామ్ మినహా మిగిలిన జలాశయాల్లో పూడిక ప్రమాణం 2 శాతం ఉంది. కానీ రానున్న పదేళ్లలో ఇది చాలా ఎక్కువ మొత్తానికి చేరుకోనుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.
హారంగికే రూ.130 కోట్ల ఖర్చు
జలవిజ్ఞాన సమీక్ష నివేదిక ప్రకారం 12 డ్యామ్‌లలోకి గాను హారంగి జలాశయంలో పూడిక తీసే పనులు చేపట్టారు. కానీ గత నాలుగేళ్లుగా నత్తనడకన సాగుతోంది. 0.031 టీఎంసీల పూడికను తీయడానికి రూ.130 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేశారు. రాష్ట్రంలో ఏకై క పెద్ద జలాశయంగా పేరుపొందిన ఆల్మట్టి డ్యాంలో 8 టీఎంసీల వరకు పూడిక పేరుకుపోయినట్లు అంచనా. తుంగభద్ర డ్యామ్‌లో ఏటేటా ఓ టీఎంసీ చొప్పున జమ అవుతోంది.
తుంగభద్ర డ్యాంకు సమస్య
తుంగభద్ర డ్యామ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని కోరుతూ రాష్ట్రం లేఖ రాసింది. పూడిక ఎంత మేర ఉందో అంత మొత్తంలో నీటిని నిల్వచేయడానికి కొప్పళ జిల్లాలో ప్రత్యామ్నాయంగా నవళి వద్ద జలాశయం నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సమ్మతి కోసం వేచి చూస్తోంది. ఒక టీఎంసీ పూడిక తీయడానికి వెయ్యి ట్రాక్టర్లు అవసరం. తీసిన పూడికను వేయడానికి లక్షల ఎకరాల భూమి కావాలి, కాబట్టి ఆర్థికంగా, సాంకేతికంగా సాధ్యం కాదని నిపుణులు ప్రత్యామ్నాయ జలాశయం వైపు చూస్తున్నారు.
కేంద్రానికి లేఖలు
ప్రతి పొలానికి నీరు, డ్యాముల పునశ్చేతన పథకం కింద రూ.13,695 కోట్ల సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అంచనా మొత్తంలో తుంగభద్ర డ్యామ్‌లో 31 టీఎంసీల పూడిక ను తీయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. గత ఏడాది ఆగస్టులో మరోసారి లేఖరాసింది.
డ్యాముల సామర్థ్యానికి గండి
12 జలాశయాల్లో సమస్యాత్మకం
తొలగించాలంటే ఎంతో ఆర్థిక భారం
కేంద్ర సాయానికి రాష్ట్రం మొర

పూడిక మేట.. డ్యాములకు కోత

పూడిక మేట.. డ్యాములకు కోత

పూడిక మేట.. డ్యాములకు కోత