
ఘనంగా జన్మదిన వేడుక
సాక్షి బళ్లారి: బళ్లారి గ్రామీణ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బీ.నాగేంద్ర జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని నగరంలోని పలు వార్డుల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకొన్నారు. కనక దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు, కుంకుమార్చన చేయడంతో పాటు కేక్ కట్ చేశారు. నాగేంద్ర పుట్టినరోజు సందర్భంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లినా ఆయన అభిమానులు వాడవాడలా జన్మదినాన్ని నిర్వహించారు. నగర ఎమ్మెల్యే నారాభరత్‌రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఫెక్సీలు, బ్యానర్లు వేయడంతో పాటు హోమాలు, పూజలు చేసి నాగేంద్రకు మంచి జరగాలని ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకొన్నారు. నగరంలోని కనకదుర్గమ్మ ఆలయం ముందు కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు వెంకటేష్‌హెగ్డే, మాజీ ఉపమేయర్ బెణకల్లు బసవరాజు, కార్పొరేటర్లు శశికళ జగన్నాథ్, గాదెప్ప, వివేక్(విక్కీ), కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు తిమ్మనగౌడ, ఏ.మానయ్య కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు.