
రాజ్యాంగ పరిరక్షణ మనందరి బాధ్యత
రాయచూరు రూరల్: భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడం మనందరి బాధ్యత అని గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సోమవారం నగరంలోని మహాత్మాగాంధీ క్రీడా మైదానంలో జిల్లాధికార యంత్రాంగం, జిల్లా పంచాయతీ, సాంఘీక సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి మాట్లాడారు. భారత సార్వభౌమత్వాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించాలని, సామాజిక, రాజకీయ, ఆర్థిక, న్యాయ విచారాలు, అభివ్యక్తి స్వాతంత్య్రం, ధర్మశ్రద్ధ వంటివి మనం పాటించాలన్నారు. కార్యక్రమంలో జిల్లాధికారి నితీష్, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, నగరసభ కమిషనర్ జుబిన్ మహాపాత్రో, సంతోష్ రాణి, విజయలక్ష్మిలున్నారు.
విషం తాగి ముగ్గురి ఆత్మహత్యాయత్నం
●ఒక యుువతి దుర్మరణం
రాయచూరు రూరల్: విషం సేవించి ముగ్గురు యుువతులు ఆత్మహత్యాయత్నం చేయడంతో ఒరు దుర్మరణం పాలైన ఘటన రాయచూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం దేవదుర్గ తాలూకా కె.ఇరబగెర పొలంలో సంభవించింది. గ్రామానికి చెందిన రేణుకమ్మ(18) మరణించింది. సునీత(19), ముదుకమ్మ(19) రాయచూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నారు. పొలంలో విషం తాగి ఊరు బావిలో దూకారు. విషం తాగి ఆత్మహత్యయత్నానికి ప్రేమ వ్యవహారమే కారణమనే విషయం వెల్లడవుతోంది. రేణుకాకు పెళ్లి నిశ్చయం అయింది. ప్రేమించిన వ్యక్తి వివాహం కాలేదనే నెపంతో విషం తాగినట్లు పోలీసులు తెలిపారు. రేణుక మరణిస్తే తమపై కేసు నెట్టుతారని భావించి వీరిద్దరూ విషం తాగి బావిలో దూకారని సీఐ మంజునాఽథ్ వివరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ పనులు చేసుకుంటూ కాలం గడుతున్న కుటుంబానికి ఇలాంటి ఘటన జరగరానిదంటూ గ్రామస్థులు చర్చించుకుంటున్నారు.
మృతుడి కుటుంబానికి పరిహారం అందజేత
సాక్షి బళ్లారి: హాసన్ జిల్లాలో వినాయక నిమజ్జనం సందర్భంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి కుటుంబానికి రూ.5 లక్షల చెక్కును అందజేశారు. ఈనెల 12వ తేదీన హాసన్ నగరంలో వినాయక నిమజ్జనం సందర్భంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు మృతి చెందగా వారిలో బళ్లారికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి ప్రవీణ్‌కుమార్ కూడా మరణించిన సంగతి విదితమే. ఈనేపథ్యంలో సోమవారం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.5 లక్షల పరిహారం విడుదల చేయడంతో నగర మేయర్ నందీష్, స్థానిక కార్పొరేటర్ శశికళ జగన్నాథ్ మృతుడు ప్రవీణ్‌కుమార్ తల్లి సుశీలమ్మకు రూ.5 లక్షల చెక్కును అందజేశారు.
ఉజ్వల భవిష్యత్తుకు
పునాది కావాలి
రాయచూరు రూరల్: పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఉపాధ్యాయులు పునాది కావాలని కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య అన్నారు. సోమవారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో రాయచూరు అన్ ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన పురస్కార సమావేశంలో మాట్లాడారు. విధులు నిర్వహించే ఉపాధ్యాయులు, పిల్లల సంక్షేమ కోసం పాటు పడాలన్నారు. ప్రతిభకు తార్కాణంగా తమ భవిష్యత్తును రూపొందించుకోవాలని పిలుపు ఇచ్చారు. వేదికపై ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులతో పాటు సన్మానం చేశారు. శాసన సభ్యులు శివరాజ్ పాటిల్, బసన గౌడ, అన్‌న్ ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయుల సంఘం పదాధికారులు రవి భూషణ్, కేశవరెడ్డి, హన్మంతప్ప, మహేశ్వరిలున్నారు.

రాజ్యాంగ పరిరక్షణ మనందరి బాధ్యత

రాజ్యాంగ పరిరక్షణ మనందరి బాధ్యత

రాజ్యాంగ పరిరక్షణ మనందరి బాధ్యత