మేకెదాటుకు తమిళనాడు ఒప్పుకోవాలి: సీఎం | - | Sakshi
Sakshi News home page

మేకెదాటుకు తమిళనాడు ఒప్పుకోవాలి: సీఎం

Sep 15 2025 8:27 AM | Updated on Sep 15 2025 8:27 AM

మేకెద

మేకెదాటుకు తమిళనాడు ఒప్పుకోవాలి: సీఎం

మండ్య: మేకెదాటు జలాశయం పథకంలో తమిళనాడు, కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేయకుండా వెంటనే అనుమతిని ఇవ్వాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య డిమాండ్‌ చేశారు. ఆదివారం జిల్లాలోని మళవళ్ళి తాలూకాలో గగనచుక్కి జలపాతోత్సవాలను సీఎం ప్రారంభించి మాట్లాడారు. మేకెదాటు జలాశయం ద్వారా సుమారు 66 టీఎంసీల నీటని సేకరించవచ్చని చెప్పారు. తమిళనాడు ఏడాదికి 177 టీఎంసీల కావేరి నీటిని మాత్రమే ఇవ్వాలి, ఈ ఏడాదిలో ఇప్పటికి 99 టిఎంసీల నీటిని ఇచ్చాం, మొత్తంగా 221 టీఎంసీల నీరు తమిళనాడుకు ప్రవహించింది, అంటే అదనంగా సుమారు 122 టీఎంసీల నీరు తమిళనాడుకు చేరింది, అదనంగా వెళ్లిపోయే నీటిని నిల్వ చేయడానికి మేకెదాటు డ్యాం నిర్మాణం అవసరం అని సీఎం చెప్పారు. తమిళనాడు ప్రభుత్వం, కేంద్రం రాజకీయం చేయకుండా వెంటనే అంగీకరించాలని కోరారు. మేకెదాటును కర్ణాటక భూభాగంలో నిర్మిస్తామని, తమిళనాడుకు ఎక్కువ జలాలను ఇవ్వడానికి ఈ పథకం అనుకూలంగా ఉంటుందని అన్నారు. దానిని తమిళనాడు ప్రజలు, ప్రభుత్వం అర్థం చేసుకోవాలన్నారు. మండ్య మైషుగర్‌ కర్మాగారానికి రూ. 113 కోట్లు ఇచ్చాం, రూ.53 కోట్ల కరెంటు బిల్లులను మాఫీ చేశాం, మరింత సాయానికి సిద్ధమని చెప్పారు.

చెట్టును కారు ఢీ, ఇద్దరి మృతి

గౌరిబిదనూరు: ఆదివారం సాయంకాలం గౌరిబిదనూరు లోని బైపాస్‌ వినాయకుని చూడడానికి నగరానికి వస్తున్న కారు ముదుగానకుంటె క్రాస్‌ సమీపంలో చెట్టుకు ఢీకొంది. కారులో ఉన్న శశి(28, మెకానిక్‌ చంద్రు(32) అనే ఇద్దరు అక్కడే తీవ్రగాయాలై మరణించారు. మరో బాధితుడు రమేశ్‌ను స్థానికులు బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. వీరు బెంగళూరు నుంచి వస్తున్నట్లు సమాచారం.

పండ్లరసంలో పురుగుల మందు కలిపి..

గౌరిబిదనూరు: మంచేనహళ్ళి సమీపంలోని మిణకనగుర్కి దగ్గర పండ్లరసంలో పురుగుల మందును కలిపి తాగి వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. తాలూకాలోని బేవినహళ్ళి గ్రామానికి చెందిన దినేశ్‌తో లక్ష్మి (36) కి వివాహమైంది. వీరికి 15, 8 సంవత్సరాల కుమార్తెలున్నారు. తరువాత ఆమె భర్తను వదిలేసి నారాయణ అనే వ్యక్తితో యలహంక సమీపంలోని సింగనాయకనహళ్లిలో నివాసం ఉంటోంది. ఆమె పెద్ద కుమార్తె మంచేనహళ్ళి తాలూకా హనుమంతపుర వసతి పాఠశాలలో ఉంటూ చదువుకుంటోంది. ఇంటికి పంపించాలని ఆమె కోరగా, సిబ్బంది పరీక్షలు ఉన్నాయని తిరస్కరించారు. చిన్న కుమార్తెతో కలిసి మిణకనగుర్కికి చేరుకుని పండ్ల రసంలో పురుగుల మందు కలిపి కుమార్తెకు ఇచ్చి తాను తాగింది. కుమార్తె ఆ పండ్లరసాన్ని తాగలేదు. తల్లి పడిపోగా కేకలు వేయడంతో కొందరు ఆమెను ఆటోలో మంచేనహళ్ళి ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఆమె చనిపోయింది. కుటుంబ సమస్యలే కారణమని అనుమానాలున్నాయి.

మతభేదాలను వీడి.. సీమంతం

మండ్య: హిందూ కుటుంబాల్లో మహిళలు గర్భం దాలిస్తే సీమంతం వేడుకను చేసుకుంటారు. అదే మాదిరి ముస్లిం మహిళకు స్థానిక హిందూ మహిళలు సీమంతం చేసి సామరస్యాన్ని చాటుకున్నారు. మండ్య జిళ్లాలోని కేఆర్‌ పేటెలో ఈ వేడుక జరిగింది. స్థానిక కో ఆపరేటివ్‌ సొసైటీలో కంప్యూటర్‌ ఆపరేటర్‌ అయిన నగ్మ అనే మహిళ గర్భిణి కావడంతో సొసైటీ పెద్దలు, మహిళా ఉద్యోగులు ఆమెకు ఘనంగా సీమంతం సంబరం చేశారు. అతిథులకు వాయనం అందజేశారు. ఎమ్మెల్యే హెచ్‌టీ మంజు పాల్గొన్నారు.

మేకెదాటుకు తమిళనాడు ఒప్పుకోవాలి: సీఎం 1
1/3

మేకెదాటుకు తమిళనాడు ఒప్పుకోవాలి: సీఎం

మేకెదాటుకు తమిళనాడు ఒప్పుకోవాలి: సీఎం 2
2/3

మేకెదాటుకు తమిళనాడు ఒప్పుకోవాలి: సీఎం

మేకెదాటుకు తమిళనాడు ఒప్పుకోవాలి: సీఎం 3
3/3

మేకెదాటుకు తమిళనాడు ఒప్పుకోవాలి: సీఎం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement