
మళ్లీ కరెంటు చార్జీల షాక్?
శివాజీనగర: ఇప్పటికే బస్సు చార్జీలు, పాల ధరలు, మద్యం రేట్లు.. ఇలా అనేక రకాలుగా ధరల పెరుగుదలతో అవస్థలు పడుతున్న రాష్ట్ర ప్రజలకు మరో షాక్ తగలబోతోంది. త్వరలోనే కరెంటు చార్జీలను పెంచాలని విద్యుచ్ఛక్తి నియంత్రణా కమిషన్‌కు బెస్కాం ప్రతిపాదనలు సమర్పించింది. ప్రతి యూనిట్‌కు కొంచెం ఎక్కువ మొత్తంలోనే చార్జీని పెంచాలని బెస్కాం విన్నవించింది. ఇప్పటికే పలుసార్లు వ్యాపార, పరిశ్రమల రంగానికి విద్యుత్ ధరలను బాదేసిన బెస్కాం, మళ్లీ భారం మోపడానికి సిద్ధమైంది. ఈ ప్రతిపాదన ప్రజల ఆగ్రహానికి కారణమైంది.