
జిల్లా స్థాయి దసరా క్రీడలు ప్రారంభం
హొసపేటె: నగరంలోని పునీత్ రాజ్‌కుమార్ జిల్లా స్టేడియంలో ఆదివారం జిల్లా స్థాయి దసరా క్రీడలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరైన విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే హెచ్‌ఆర్ గవియప్ప క్రీడాకారులను పరిచయం చేసుకుని వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లలు విద్యతో పాటు క్రీడల్లో కూడా పాల్గొనాలన్నారు. నియోజకవర్గం నుంచి చాలా మంది వివిధ క్రీడల్లో రాష్ట్ర స్థాయిలో సత్తా చాటడం అభినందనీయమన్నారు. క్రీడాకారులకు అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కార్యక్రమంలో క్రీడాశాఖ అధికారులు, వివిధ శాఖల అధికారులు, క్రీడాకారులు పాల్గొన్నారు.