
5.20 లక్షల హెక్టార్లలో పంటనష్టం
బనశంకరి: రాష్ట్రంలో అతివృష్టితో తలెత్తిన నష్టం, పంట నష్టాల పరిహార చర్యలు గురించి సీఎం సిద్దరామయ్య సోమవారం నివాస కార్యాలయమైన కృష్ణాలో జిల్లాకలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ ఏడాది 23 శాతం అధిక వర్షం కురిసిందన్నారు. దెబ్బతిన్న పంటలు, ఇళ్లకు పూర్తిస్థాయిలో పరిహారం అందించాలన్నారు.
111 మంది మృత్యువాత
● పంట నష్టం సమీక్షను త్వరగా పూర్తిచేసి పరిహార పంపిణీ చేపట్టాలని సీఎం తెలిపారు. రాష్ట్రంలో అతివృష్టితో 4,80256 హెక్టార్లలో పంటలు, 40,407 హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయన్నారు. మొత్తం 5,20,663 హెక్టార్లలో పంటలు పాడైనట్లు తెలిపారు.
● వర్షాల వల్ల ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 111 మంది చనిపోయారు, వారి కుటుంబాలకు రూ.5.55 కోట్లు పరిహారం అందించామని తెలిపారు.
● వర్షంతో 651 ఇళ్లు పూర్తిగా ధ్వంసం కాగా, 9087 ఇళ్లు కొంతమేర దెబ్బతిన్నాయన్నారు. ఇళ్ల యజమానులకు పరిహారం అందించడంతో పాటు ఇళ్లు నిర్మించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
నీటి మట్టం తగ్గింది
రాష్ట్ర ప్రముఖ జలాశయాల్లో నీటిమట్టం గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం కొంచెం తక్కువగా ఉంది. ప్రధాన డ్యాముల్లో 840 టీఎంసీల నీరు ఉందని చెప్పారు. గతేడాది కంటే ఇది 16 టీఎంసీలు తక్కువని తెలిపారు. తుంగభద్ర ఆనకట్ట గేట్లను మార్చడం తుంగభద్ర బోర్డు పని అని, మొదటి పంటకు నీరు ఇచ్చి మరమ్మతులు పూర్తిచేయాలని అధికారులకు సూచించారు.
అతివృష్టిపై సీఎం సిద్దు సమీక్ష
సర్వే చేసి పరిహారం అందించాలి