
సిట్ అదుపులో కుట్ర నిందితులు
బనశంకరి: ధర్మస్థల మీద దుష్ప్రచారం కుట్ర కేసు దర్యాప్తు తీవ్రతరం చేసిన సిట్ అధికారులు గిరీశ్ మట్టణ్ణవర్, జయంత్‌ను విచారిస్తున్నారు. జయంత్ చెప్పడం వల్లే యూట్యూబ్‌లో వీడియోలను ప్రసారం చేసినట్లు యూట్యూబర్ అభిషేక్ చెప్పాడు. వారి కాల్ డేటాను తీసుకున్నారు. మాస్క్‌మ్యాన్ చిన్నయ్య తీసుకువచ్చిన పుర్రె వీడియోను ప్రసారం చేసిన కేరళ కోజికోడ్‌వాసి మనాఫ్ ను కూడా సోమవారం ఆధారాలతో రావాలని ఆదేశించారు. పుర్రెను తెచ్చి చిన్నయ్యకు ఇచ్చిన సౌజన్య మామ విఠల్‌గౌడ సిట్ అదుపులోనే ఉన్నాడు. అభిషేక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసి యూట్యూబర్ అయ్యాడు, ధర్మస్థల కుట్రదారులు తిమరోడి, జయంత్‌లతో పరిచయం ఏర్పడింది. తమ కుమారునికి ఎలాంటి సంబంధం లేదని అభిషేక్ తల్లిదండ్రులు చెప్పారు.
అవశేషాలు లభ్యం
ధర్మస్థల వద్ద బండ్లగుడ్డె అడవిలో మానవ అవశేషాలు దొరికాయి. విఠల్‌గౌడ ఇచ్చిన సమాచారం ఆధారంగా వెతగ్గా అస్థిపంజర భాగాలు దొరికాయని తెలిసింది.
అతడే హత్యాచారం చేశాడు
సౌజన్య అత్యాచారం, హత్య కేసుకు సంబంధించి మైసూరు సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారంనాడు బెళ్తంగడిలో మీడియాతో మాట్లాడుతూ, ధర్మస్థలలో 2012 ఆగస్టు 9న విద్యార్థిని సౌజన్యపై అత్యాచారం, హత్య చేసింది ఆమె మామ విఠల్‌గౌడ అని చెప్పారు. అతనికి నార్కో అనాలిసిస్ చేయిస్తే నిజాలు వెలుగు చూస్తాయన్నారు.
ధర్మస్థల కేసులో రోజురోజుకూ కొత్త పేర్లు