
గురువులకు ప్రామాణికత అవసరం
రాయచూరు రూరల్ : సమాజంలో ఉపాధ్యాయులు ప్రామాణికత, నిజాయితీతో విధులు నిర్వహించాలని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు, నగర శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ పేర్కొన్నారు. శనివారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో ఏర్పాటు చేసిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని జ్యోతి వెలిగించి ప్రారంభించి మాట్లాడారు. ఉపాధ్యాయులు విద్యార్థుల ఉత్తమ భవిష్యత్తుకు, ఉన్నత విద్యనభ్యసించేందుకు కృషి చేయాలన్నారు. ఉపాధ్యాయులు నిష్ట, ప్రామాణికత, దక్షతతో విధులు నిర్వహించి ఉన్నత విద్యను బోధించాలన్నారు. 10 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. సమావేశంలో నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, సిండికేట్ సభ్యుడు చెన్నబసవ, జిల్లా విద్యాశాఖాధికారి బడిగేర్, విద్యా శాఖ అధికారులు ఈరణ్ణ, చంద్రశేఖర్, ఉపాధ్యాయుల సంఘం పదాధికారులు చంద్రశేఖర్‌రెడ్డి, యంకప్ప, మొయిన్ ఉల్ హక్, యంకప్ప, రమేష్, జయంతిరావ్, శివమూర్తిలున్నారు.

గురువులకు ప్రామాణికత అవసరం