
నవ దంపతుల ఆదర్శం
● నేత్రదానానికి హామీ
మైసూరు: పదేళ్ల పాటు ప్రేమించుకున్న ఓ జంట దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టింది. మైసూరు నివాసి చందన్, లావణ్య శనివారం ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో గుడిలో సరళరీతిలో మనువాడారు. ఈ సందర్భంగా తామిద్దరు మరణానంతరం నేత్రదానం చేస్తామని ఓ కంటి ఆస్పత్రికి ప్రమాణపత్రం రాసిచ్చారు. చందన్ మాట్లాడుతూ పెళ్లి రోజున సమాజానికి కానుకగా జ్ఞాపకంగా ఉండాలని వర నటుడు డాక్టర్ రాజ్‌కుమార్ చూపిన మార్గంలో నేత్రదానానికి అంగీకరించామని చెప్పారు. నవ దంపతులు అందరి ప్రశంసలకు పాత్రులయ్యారు.