మైసూరుకు రాష్ట్రపతి రాక
● నేడు ప్యాలెస్ సందర్శన
మైసూరు: దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పర్యటన కోసం సోమవారం మైసూరు నగరానికి చేరుకున్నారు. నగర సమీపంలోని మండకళ్లి విమానాశ్రయంలో ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్, జిల్లా కలెక్టర్ జీ.లక్ష్మికాంత్‌రెడ్డి, పోలీసు కమిషనర్ సీమా లాట్కర్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తరువాత మైసూరు వర్సిటీలో జరిగిన ఆయుష్ వజ్రోత్సవంలో పాల్గొన్నారు. స్మారక సంచికను ఆవిష్కరించారు. రాత్రికి మైసూరు నగరంలోనే బస చేశారు. మంగళవారం ఉదయం మైసూరు ప్యాలెస్‌కు చేరుకుని రాజ వంశీకురాలు ప్రమోదాదేవి ఆతిథ్యాన్ని స్వీక రించి ప్యాలెస్‌ను వీక్షిస్తారు.
మైసూరుకు రాష్ట్రపతి రాక


