
నిప్పుల పాలైన సహజీవనం
బొమ్మనహళ్ళి: సిలికాన్ సిటీలో సహజీవన ఘోరాలు పెరిగిపోతున్నాయి. రెండు పదులు దాటిన మహిళ, ఐదు పదులు దాటిన వ్యక్తి సహజీవనం విషాదాంతమైంది. అతనిలో అనుమానం పెనుభూతమై ఆమెకు నిప్పంటించాడు.
బెంగళూరు హులిమావు ఠాణా పరిధిలో ఈ ఘోరం జరిగింది. వివరాలు.. మలెనల్లసంద్రకు చెందిన వనజాక్షి (26) గతంలో వివాహమై భర్త చనిపోయాడు. రెండేళ్ల కొడుకుతో జీవిస్తోంది. విఠల్ (52) అనే క్యాబ్ డ్రైవర్‌తో పరిచయమై సహజీవనం ప్రారంభించారు. మూడేళ్ల నుంచి కలిసి ఉంటున్నారు. అయితే వనజాక్షి కొన్నిరోజులుగా మరో యువకునితో సన్నిహితంగా ఉందని, తనను పట్టించుకోవడం లేదని విఠల్ అనుమానించాడు. ఆమెను రహస్యంగా వెంటాడసాగాడు. శనివారం వనజాక్షి మునియప్ప మరో వ్యక్తితో కలిసి కారులో ఆస్పత్రికి వెళుతున్న సమయంలో తన కారుతో అడ్డుకున్నాడు. కారులో నుంచి వనజాక్షిని ఈడ్చివేసి ఆమైపెన పెట్రోల్ పోశాడు. ఆమె తప్పించుకుని పారిపోతుండగా విఠల్ నిప్పు అంటించాడు. తీవ్రంగా గాయాలైన ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం చనిపోయింది. ఈ సంఘటనలో మరో కారు డ్రైవర్ మునియప్ప, విఠల్‌కు కూడా గాయాలయ్యాయి. హులిమావు పోలీసులు పరారీలో ఉన్న విఠల్‌ను అరెస్టు చేశారు.
మహిళపై ప్రియుడు పెట్రోలుతో దాడి

నిప్పుల పాలైన సహజీవనం