అధిక జనాభాతో అనర్థాలు | - | Sakshi
Sakshi News home page

అధిక జనాభాతో అనర్థాలు

Aug 4 2025 3:47 AM | Updated on Aug 4 2025 3:47 AM

అధిక

అధిక జనాభాతో అనర్థాలు

రాయచూరు రూరల్‌: జనాభా నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఉడమ్‌ గల్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దండెప్ప బిరదార్‌ పిలుపునిచ్చారు. ఆ పాఠశాలో శనివారం ప్రపంచ జనాభా నియంత్రణ దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ అధిక జనాభాతో అనర్థాలు చోటు చేసుకుంటాయన్నారు. ప్రజలందరికీ సదుపాయాలు కల్పించడ కష్టసాధ్యమవుతుందన్నారు. పరిమిత కుటుంబంతోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు.

చెస్‌ పోటీల్లో విజయపుర, రాయచూరు గెలుపు

రాయచూరు రూరల్‌ : రాజీవ్‌ గాంధీ అరోగ్య వర్సిటీ ఆధ్వర్యంలో నవోదయ కళాశాల క్రీడాంగణంలో నిర్వహిస్తున్న కలబుర్గి డివిజన్‌ స్థాయి చెస్‌ పోటీల్లో విజయపుర, రాయచూరు జిల్లాలు ప్రథమ స్థానాల్లో నిలిచాయి. ఆదివారం ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమంలో నవోదయ కళాశాల రిజిస్ట్రార్‌ శ్రీనివాస్‌ హాజరై విజేతలకు బహుమతులు అందించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. చెస్‌ క్రీడలు మేథస్సును పెంపొందిస్తాయన్నారు. గురుచార్‌, దొడ్డయ్య, సుధా కుమారి, గిరస్‌ కట్టి, కౌశిక్‌ రెడ్డి, చంద్రకాంత్‌, సావిత్రి, నేతానియల్‌ పాల్గొన్నారు.

కారు బోల్తా .. ఒకరి మృతి

రాయచూరు రూరల్‌: కారు బోల్తా పడి ఒకరు మృతి చెందగా ఐదుగురికి గాయాలయ్యాయి. ఈఘటన రాయచూరు తాలుకా మన్సలాపూర్‌ వద్ద జరిగింది. కొందరు ఉడుపి నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా మన్సలాపూర్‌ వద్దకు రాగానే కారు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఉడుపి జిల్లా కుందాపూర్‌ తాలూకా కోట్రేశ్వర హజీర(65) అనే మహిళ మృతి చెందగా మరో ఐదుగురు గాయపడ్డారు. రూరల్‌ పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి క్షతగాత్రులను, హజీరా మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.

విద్యా సంస్థల్లో మానసిక వైద్యులను నియమించాలి

రాయచూరురూరల్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ హైస్కూలు, జూనియర్‌ కళాశాలల్లో మానసిక వైద్యులను నియమించాలని సామాజిక కార్యకర్త సంతోష్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఈమేరకు అదివారం ప్రభుత్వానికి పోస్టు ద్వారా కార్డులు పంపారు. అనంతరం ఆయన మాట్డాడుతూ విద్యార్థులు నిత్యం మానసిక ఒత్తిడికి గురవుతున్నారన్నారు. చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. అలాంటివారికి విద్యా సంస్థల్లోనే కౌన్సిలింగ్‌ ఇవ్వడం ద్వారా వారిని సరైన మార్గంలో నడిపించవచ్చన్నారు. ఇందు కోసం బియస్‌డబ్ల్యూ, యంయస్‌డబ్ల్యూ కోర్సులు చేసిన వారిని విద్యాసంస్థల్లో నియమించాలన్నారు.

డిమాండ్ల సాధనకు

5 నుంచి సమ్మె

రాయచూరు రూరల్‌: కేఎస్‌ ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని ఉద్యోగుల, కార్మికుల సంఘం అధ్యక్షుడు ముద్దుకృష్ణ డిమాండ్‌ చేశారు. నగరంలోని పాత్రికేయల భవనంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల స మావేశంలో ఆయన మాట్లాడారు. 38 నెలుగా వేతనాలు చెల్లించకపోవడంతో ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దీంతో ఈనెల 5 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు తెలిపారు.

వర్క్‌ ఫ్రం హోం అంటూ వంచన

హుబ్లీ: ఇంటి వద్దనుంచే పని అంటూ సైబర్‌ వంచకులు ఓ వ్యక్తి నుంచి రూ. 5లక్షలు దోచుకున్నారు. ఈఘటన హుబ్లీలో చోటు చేసుకుంది. రక్షిత అనే మహిళకు వంచకులు వ్యాట్సాప్‌ ద్వారా పరిచయం చేసుకున్నారు. ఇంట్లోనే కూర్చొని డబ్బు సంపాదించవచ్చని మభ్య పెట్టారు. ఆమె స్నేహితురాలు డీ సోహెప్ప ఖాతా నుంచి రూ.5.99 లక్షలు తమ ఖాతాకు జమ చేయించుకున్నారు. అనంతరం ఎలాంటి ఉద్యోగమూ ఇవ్వలేదు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అధిక జనాభాతో అనర్థాలు1
1/3

అధిక జనాభాతో అనర్థాలు

అధిక జనాభాతో అనర్థాలు2
2/3

అధిక జనాభాతో అనర్థాలు

అధిక జనాభాతో అనర్థాలు3
3/3

అధిక జనాభాతో అనర్థాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement