
సెంట్రల్ జైల్లో ప్రజ్వల్ పుట్టినరోజు
యశవంతపుర: మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, హాసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ 35వ పుట్టిన రోజును జైల్లో చేసుకున్నారు. ఇంటి పనిమనిషి మీద అత్యాచారం కేసులో యావజ్జీవ శిక్ష పడిన ప్రజ్వల్ రేవణ్ణ బెంగళూరు పరప్పన అగ్రహర జైల్లో ఖైదు అనుభవిస్తున్నారు. ఆదివారం ఆయనకు ఖైదీలు ధరించే యూనిఫారాన్ని అందజేశారు. సోమవారం నుంచి ఏమేం పనులు చేయాలో జైలు సిబ్బంది వివరించారు. వారానికి ఆరు రోజులు నిబంధనల ప్రకారం పనులు చేయాలని తెలిపారు. రోజువారి కూలీ రూ.540 ఇస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం ప్ర జ్వల్ వైభవంగా నిర్వహించిన జన్మదినం వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. మరోవైపు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించాలని ఆయన న్యాయవాదులు సిద్ధమయ్యారు.
శృంగేరిలో తండ్రి పూజలు
తనయుడు ప్రజ్వల్ జన్మదినం సందర్భంగా తండ్రి హెచ్‌డీ రేవణ్ణ శృంగేరి శారదాంబ దేవస్థానంలో విశేష పూజలు చేశారు. సోమవారం రాత్రి శృంగేరికి వెళ్లి గురుపీఠం మరాధిపతిని కలిశారు. మంగళవారం ఉదయం శారదా మాతను దర్శించుకుని పూజలు చేశారు.
రోజువారీ కూలీ పనుల అప్పగింత

సెంట్రల్ జైల్లో ప్రజ్వల్ పుట్టినరోజు