
పథకాలు కార్మికుల దరి చేరాలి
శ్రీనివాసపురం : ప్రభుత్వ పథకాలు, సౌలభ్యాలను అర్హులైన కార్మికులకు అందించాలని అధికారులకు ఎమ్మెల్యే జీకే వెంకటశివారెడ్డి సూచించారు. పట్టణంలోని పురసభ వాణిజ్య సముదాయ ప్రాంగణంలో కార్మిక శాఖ, కార్మిక సంక్షేమ శాఖ మండలి ఆధ్వర్యంలో మంగళవారం ఆయన కార్మికులకు కిట్లు పంపిణీ చేసి మాట్లాడారు. సంఘటిత, అసంఘటిత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సౌలభ్యాలను కల్పిస్తోందని, వాటిని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్మిక సంఘం నాయకుడు ఆనంద్, నవీన్‌కుమార్, మల్లప్ప, సిబ్బంది పాల్గొన్నారు.