
రెడ్డి సముదాయం ఐక్యతగా ఉండాలి
రాయచూరు రూరల్ : రెడ్డి సమాజం ఐక్యమత్యం ప్రదర్శించాలని హేమరెడ్డి మల్లమ్మ వేమానంద హోసల్లి మఠాధిపతి వేమానంద మహా స్వామీజీ పిలుపునిచ్చారు. రాయచూరులోని ప్రైవేటు కళ్యాణ మంటపంలో ఏర్పాటు చేసిన సభలో స్వామీజీ పాల్గొని మాట్లాడారు. కులగణనలో హిందూ రెడ్డిగా రాయించాలన్నారు. సముదాయంలోని ఉప కులాలన్నీ ఏకమై హక్కులను పొందాలన్నారు. సభలో గోపాల్ రెడ్డి, రామచంద్రా రెడ్డి, అచ్యుత రెడ్డి, శ్రీనివాస రెడ్డి, సుధాకర రెడ్డి, బసన గౌడ, కేశవ రెడ్డి, బుడ్డనగౌడ, రామనగౌడ, విరుపన గౌడ, సత్యనారాయణ, లక్ష్మికాంత రెడ్డి పాల్గొన్నారు.

రెడ్డి సముదాయం ఐక్యతగా ఉండాలి