
యూరియా సరఫరాలో కాంగ్రెస్ సర్కార్ విఫలం
హొసపేటె: నైరుతి రుతుపవనాలు రాకమునుపే విస్తారంగా వర్షాలు కురిసిన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అవసరమైన మొత్తంలో యూరియా, ఎరువులను సరఫరా చేయలేక పోయిందని బీజేపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు సంజీవ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎరువుల కొరత తీవ్రంగా ఉందన్నారు. యూరియా కోసం రైతులు క్యూలో గంటల కొద్దీ వేచి ఉండాల్సి వస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 8.73 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయగా 6.30 లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి చెలువరాయ స్వామి వ్యాఖ్యలు చేశారని, మిగిలిన 2.43 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కాంగ్రెస్ ప్రభుత్వం బ్లాక్‌లో విక్రయించిందా అని ప్రశ్నించారు. బీజేపీ రైతు మోర్ఛా జిల్లా అధ్యక్షుడు హోంబలే రేవన్న మాట్లాడుతూ బీజేపీ హయాంలో రైతుల పిల్లలకుచ్చే రైతు విద్యానిధి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఉపయోగపడే నానోయూరియాను అందిస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం దీని పై అవగాహన కల్పించడం మర్చిపోయిందన్నారు.