
రోడ్డు ప్రమాదంలో 22 మందికి గాయాలు
రాయచూరు రూరల్ : జిల్లాలోని మాన్వి, కుర్డిల మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో 22 మంది గాయపడిన ఘటన బుధవారం రాత్రి జరిగింది. టాటా ఏస్ వాహనంలో కొరివి గ్రామానికి వెళుతుండగా టైర్ పేలి అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఉరుకుందమ్మ, మంగమ్మ, హనుమేష్, అంజమ్మ, మారెమ్మ, రాఘమ్మ, భీమప్ప, హుసేనమ్మతో పాటు మరి కొంత మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారు రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై మాన్వి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
బైక్ ఢీకొని ఆటో బోల్తా..
ఐదుగురికి తీవ్ర గాయాలు
హొసపేటె: అతివేగంగా వస్తున్న బైక్ చోదకుడు ఆటోను ఢీకొనడంతో అదుపు తప్పి ఆటో బోల్తా పడగా ఆటోలో ఉన్న ఐదుగురికి తీవ్ర గాయాలైన ఘటన జరిగింది. ఆటోలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు తమ పని మీద కొండనాయకనహళ్లికి వెళ్లి తిరిగి నగరం వైపు వస్తుండగా నగరంలోని బళ్లారి సర్కిల్ సమీపంలో వేగంగా ఎదురుగా వస్తున్న బైక్ ఆటోను బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటో బోల్తా పడింది. ఆటోలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు యోగాలక్ష్మి, అనిత, నాగరత్న, గంగమ్మతో పాటు ఆటో డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారు నగర ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో 22 మందికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో 22 మందికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో 22 మందికి గాయాలు