పెన్షనర్లకు ఆరో వేతనం చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

పెన్షనర్లకు ఆరో వేతనం చెల్లించాలి

Jul 26 2025 8:40 AM | Updated on Jul 26 2025 9:12 AM

రాయచూరు రూరల్‌: పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఆరో వేతన శ్రేణిని చెల్లించాలని పదవీ విరమణ ఉద్యోగుల సంఘం డిమాండ్‌ చేసింది. శుక్రవారం జిల్లాదికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు మహదేవప్ప మాట్లాడారు. 2016లో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు వేతన పద్ధతిని అమలు చేయాలన్నారు. 2025లో పార్లమెంట్‌లో ఆర్థిక బిల్లుల బడ్జెట్‌లో పేర్కొన్నట్లు పెన్షన్‌ను కూడా ఆరో వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా వేతనాలను చెల్లించాలని కోరుతూ జిల్లాధికారి ద్వారా ప్రధానమంత్రికి వినతిపత్రం సమర్పించారు.

హెల్మెట్‌ ధారణపై అవగాహన

హొసపేటె: నగరంలో పునీత్‌ రాజ్‌కుమార్‌ సర్కిల్‌లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ద్విచక్రవాహన చోదకులకు హెల్మెట్‌ ధారణపై అవగాహన కల్పించారు. హొసపేటె డీఎస్పీ మంజునాథ్‌ నేతృత్వంలో హెల్మెట్‌ ధరించని రైడర్లకు గులాబీలు ఇచ్చారు. విజయనగర జిల్లా అంతటా ట్రిపుల్‌ రైడింగ్‌, లైసెన్స్‌ లేకుండా డ్రైవింగ్‌, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, మైనర్‌ డ్రైవింగ్‌, పని చేయని సిగ్నల్‌ సమస్యలతో సహా ట్రాఫిక్‌ సంబంధిత సమస్యలపై పోలీసు అధికారులు సమీక్షించారు. డీఎస్పీ మాట్లాడుతూ హెల్మెట్‌ లేకుండా బైక్‌ డ్రైవింగ్‌ చేయడం సరికాదని తెలిపారు. మీ జీవితం, మీ భద్రత మీ చేతుల్లోనే ఉందని అన్నారు. ట్రాఫిక్‌ సీపీఐ హులుగప్ప, టౌన్‌ సీఐ లకన్‌ మసగుప్పి, రూరల్‌ సీఐ గురురాజ్‌ కట్టిమని, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలి

హొసపేటె: కళ్యాణ కర్ణాటక ప్రాంతంలో అతి పెద్ద అటవీ ప్రాంతం హొసపేటె నుంచి చిత్రదుర్గ వరకు విస్తరించి ఉంది. అటవీ సంరక్షణ, విస్తరణకు అటవీ శాఖ మరింత బాధ్యత వహించాలని ఎమ్మెల్యే హెచ్‌ఆర్‌ గవియప్ప అన్నారు. ఆయన గురువారం ప్రాంతీయ అటవీ విభాగం సహకారంతో నగరంలోని రాజీవ్‌ నగర్‌ పార్క్‌లో నిర్వహించిన వనమహోత్సవం, పర్యావరణంపై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత మాట్లాడారు. అటవీ అభివృద్ధికి కేటాయించిన నిధులను సక్రమంగా వినియోగించుకోవడంలో అటవీ శాఖ ముందుండాలని ఆయన అన్నారు. తుంగభద్ర నది నీటిని అటవీ ప్రాంతాలకు శాసీ్త్రయంగా ఉపయోగించుకోవాలని అన్నారు. చెరువులకు పైపులైన్ల ద్వారా నదీ జలాలను తరలించి సేకరిస్తే, భూగర్భ జలాలు మరింత సమృద్ధి చెందుతాయన్నారు. కమలాపురలోని దరోజీ కరడిధామ, అటల్‌ జీ జూలాజికల్‌ పార్క్‌లలో వన్యప్రాణుల ప్రదేశాలను సందర్శించడానికి ప్రజలను ప్రోత్సహించాలన్నారు. ప్రత్యేక జంతు జాలం ఉన్న అటవీ ప్రాంతాల్లో అనేక రకాల పక్షులు తరచుగా కనిపిస్తాయి. గ్రేట్‌ ఇండియన్‌ బస్టర్డ్‌ ఈ ప్రాంతంలో అరుదైన పక్షి అని సమాచారం ఉంది. వన్య ప్రాణులను, పక్షులను ఆకర్షించే అటవీ సంపదను మనం పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా అటవీ డిప్యూటీ కన్జర్వేటర్‌ హెచ్‌.అనుపమ తదితరులు పాల్గొన్నారు.

పెన్షనర్లకు ఆరో వేతనం చెల్లించాలి 1
1/1

పెన్షనర్లకు ఆరో వేతనం చెల్లించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement