
కంటైనర్– బస్సు ఢీ
శివమొగ్గ: శివమొగ్గ జిల్లాలో కేఆర్ ఆర్టీసీ బస్సు– లారీ ఢీకొన్నాయి. సాగర్ తాలూకా ఆనందపుర వద్ద గురువారం ఈ ఘటన జరిగింది. సాగర్ నుంచి శివమొగ్గకు వెళ్తున్న బస్సును ఎదురుగా వచ్చిన కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సు డ్రైవర్‌తో పాటు నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. బస్సు డ్రైవర్ శివానంద నాయక, కండక్టర్ ఫక్కీరప్పకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమయంలో వస్తున్న స్కూలు బస్సులో బాధితులను ఆస్పత్రికి తరలించారు.
రెండు ఆర్టీసీ బస్సులు ఢీ,
25 మందికి గాయాలు
బనశంకరి: హాసన్ జిల్లాలో రెండు కేఎస్ ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గురువారం సకలేశపుర తాలూకా మారనహళ్లి వద్ద హైవేలో ఈ ఘటన జరిగింది. బెంగళూరు నుంచి మంగళూరుకు వెళుతున్న బస్సు, ధర్మస్థల నుంచి బెంగళూరుకు వస్తున్న బస్సు ఢీకొన్నాయి. రెండు బస్సుల్లోని డ్రైవర్లు సహా 25 మంది ప్రయాణికులు గాయపడగా, సకలేశపుర ఆసుపత్రికి తరలించారు. బస్సుల ముందుభాగాలు ధ్వంసమయ్యాయి.
పలువురికి తీవ్ర గాయాలు