
నకిలీ రికార్డులతో ఆస్తి మార్పు తగదు
రాయచూరు రూరల్: అక్రమంగా నకిలీ రికార్డులతో ఆస్తుల మార్పు తగదని జేడీఎస్ కార్యదర్శి జంబునాథ్ యాదవ్ పేర్కొన్నారు. బుధవారం పాత్రికేయుల భవనంలో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో నిజమైన ఆస్తులు కలిగిన వారు ఒక్కసారి నగరసభ కార్యాలయానికి వెళ్లి ఆస్తులు తమ పేరు మీద ఉన్నాయో, లేదో అని విచారణ చేపట్టాలన్నారు. మధ్యవర్తులు, అధికారులు ఏకమై నకిలీ రికార్డులు తయారు చేసి అక్రమంగా ఇతరులకు విక్రయించిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. సంతోష్ స్థలంలో నకిలీ రికార్డులు తయారు చేసి ఇతరులకు విక్రయించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ చేయించారన్నారు. రాయచూరు, సిరవార, లింగసూగూరు తాలూకాల్లో 36 మందిపై పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారన్నారు.