రోడ్లలో గుంతలు పూడ్చాలని రాస్తారోకో | - | Sakshi
Sakshi News home page

రోడ్లలో గుంతలు పూడ్చాలని రాస్తారోకో

Jul 24 2025 7:08 AM | Updated on Jul 24 2025 7:08 AM

రోడ్ల

రోడ్లలో గుంతలు పూడ్చాలని రాస్తారోకో

రాయచూరు రూరల్‌: నగరంలో వివిధ ప్రాంతాల్లోని రహదారుల్లో పడ్డ గుంతలను పూడ్చాలని సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ డిమాండ్‌ చేసింది. బుధవారం ఆశాపూర్‌ రహదారిలో చేపట్టిన రాస్తారోకోను ఉద్దేశించి జిల్లాధ్యక్షుడు అజీజ్‌ జాగీర్దార్‌ మాట్లాడారు. నగరసభకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.కోట్లాది మేర నిధులు వచ్చినా రహదారుల్లో పడిన గుంతలను పూడ్చడంలో అధికారులు, నగరసభ సభ్యులు నిర్లక్ష్యం వహించడం తగదన్నారు. నగరంలో వివిధ వార్డుల్లో పడిన పెద్ద గుంతల మరమ్మతులకు నగరసభ అధికారులు ముందుకు రావాలన్నారు.

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

రాయచూరు రూరల్‌: వాతావరణ మార్పులతో ఇటీవల జిల్లాలో నిరంతరంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లాధికారి నితీష్‌ ఆదేశించారు. బుధవారం తన కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో జరిగే అపాయాల గురించి స్థానికంగా ఉంటూ అధికారులు ప్రజల ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు సేకరించి ఎప్పటికప్పుడు జిల్లా కేంద్రానికి సమాచారం అందించాలన్నారు.

హాస్టళ్లలో సౌకర్యాల

కోసం ర్యాలీ

రాయచూరు రూరల్‌: రాష్ట్రంలోని వివిధ హాస్టళ్లలో కనీస మౌలిక సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని ఏబీవీపీ డిమాండ్‌ చేసింది. బుధవారం అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద చేపట్టిన ఆందోళనలో జిల్లాధ్యక్షుడు గురుకిరణ్‌ శెట్టి మాట్లాడారు. రాష్ట్రంలోని 1258 బీసీఎం, 1972 సాంఘీక సంక్షేమ శాఖ హాస్టళ్లలో మొత్తం 3,52,089 మంది విద్యార్థులు ఆశ్రయం పొందుతున్నారన్నారు. వారికి కనీస మౌలిక సౌకర్యాలు లేవన్నారు. హాస్టళ్లలో ప్రవేశాలు కల్పించాలని, విద్యార్థులకు విద్యార్థి వేతనాలు చెల్లించాలని ఒత్తిడి చేశారు.

అహింద కార్మిక సంఘం కార్యవర్గం నియామకం

బళ్లారి అర్బన్‌: నగరంలో మాజీ మంత్రి, బళ్లారి రూరల్‌ ఎమ్మెల్యే బీ.నాగేంద్ర తన స్వగృహ కార్యాలయంలో జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు ఎంజీ కనక నేతృత్వంలో సదరు సంఘం నూతన పదాధికారుల నియామకాన్ని ప్రకటించారు. ఆ మేరకు జిల్లా కార్మికుల సంఘం కొత్త అధ్యక్షుడిగా చేళ్లగుర్కి ఆంజనేయ, ఉపాధ్యక్షుడుగా క్రాంతికుమార్‌, కార్యదర్శులుగా హొన్నూరు స్వామి, రమేష్‌, బళ్లారి గ్రామీణ తాలూకా కార్మిక విభాగం అధ్యక్షుడిగా చేళ్లగుర్కి రామకృష్ణలకు మాజీ మంత్రి నియామక ఆదేశాలను అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. ప్రముఖులు మారుతీ, ఉమర్‌ ఫారూఖ్‌, చేళ్లగుర్కి నాగరాజ్‌, జిల్లా యువ అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌, ఆటో డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆప్తమిత్ర బాషా, జిల్లా సంఘం కార్యదర్శి గంగాధర్‌, మెహబూబ్‌ బాషా, ఖాలిద్‌ బాషా, వైఫై శివు, బాషా, సునీల్‌, భీమా తదితరులు పాల్గొన్నారు.

తుంగభద్ర ఎడమ కాలువలో పడి బాలిక మృతి

హొసపేటె: తుంగభద్ర ఎడమ కాలువలో ఓ బాలిక ఆకస్మికంగా కాలు జారి పడి చనిపోయిన సంఘటన గంగావతి తాలూకాలో జరిగింది. విద్యార్థిని చైత్ర నారప్ప యాదవ్‌(13) పాఠశాలకు వెళ్లే హడావుడిలో తుంగభద్ర ఎడమ కాలువపై వేసిన పైపుపై నడుచుకుంటూ వెళుతుండగా బాలిక అదుపు తప్పి జారి ఎడమ కాలువలో పడి కొట్టుకు పోయి మృతి చెందింది. మృతి చెందిన బాలిక గంగావతి తాలూకాలోని బసాపట్టణ గ్రామ పంచాయతీ పరిధిలోని కరేకల్లప్పన క్యాంపులోని ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఈ ఘటనపై గంగావతి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

రోడ్లలో గుంతలు  పూడ్చాలని రాస్తారోకో1
1/3

రోడ్లలో గుంతలు పూడ్చాలని రాస్తారోకో

రోడ్లలో గుంతలు  పూడ్చాలని రాస్తారోకో2
2/3

రోడ్లలో గుంతలు పూడ్చాలని రాస్తారోకో

రోడ్లలో గుంతలు  పూడ్చాలని రాస్తారోకో3
3/3

రోడ్లలో గుంతలు పూడ్చాలని రాస్తారోకో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement