
మతమార్పిడితో పాటు యువకుడి పేరు మార్పు
మైనర్‌తో వివాహంపై భర్తపై పోక్సో కేసు నమోదు
రాయచూరు రూరల్(కర్ణాటక): గదగ్‌లో విడ్డూరమైన లవ్ జిహాద్ కేసులో కట్టుకున్న భర్తపైనే భార్య పోక్సో కేసు పెట్టించిన ఉదంతం వెలుగు చూసింది. వివరాలు.. గదగ్‌లోని బెటగేరి ప్రాంతంలో విశాల్ కుమార్ అనే వ్యక్తి మైనార్టీ సముదాయానికి చెందిన యువతి మూడేళ్ల నుంచి ప్రేమించుకున్నారు.
వీరిద్దరూ గత ఏడాది నవంబర్‌లో వివాహం చేసుకున్నారు. అయితే వివాహ నిఖా సమయంలో తనను మతమార్పిడి చేయడమే కాకుండా మసీదులో విరాజ్ సాబ్‌గా తన పేరును మార్చారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ తాజాగా వారం రోజుల క్రితం పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించాడు. దీనిని గమనించిన యువతి మైనార్టీ తీరని 17 ఏళ్ల అమ్మాయిని వివాహం చేసుకొన్నట్లు భర్తపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.