రాజ కాలువల అభివృద్ధికి ప్రాధాన్యత | - | Sakshi
Sakshi News home page

రాజ కాలువల అభివృద్ధికి ప్రాధాన్యత

Jul 8 2025 6:55 AM | Updated on Jul 8 2025 6:55 AM

రాజ క

రాజ కాలువల అభివృద్ధికి ప్రాధాన్యత

రాయచూరు రూరల్‌: నగరంలో కోటలు, రాజ కాలువల అభివృద్ధికి ప్రాధాన్యత కల్పించాలని చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు పేర్కొన్నారు. సోమవారం నగరంలోని కోటలు, రాజ కాలువల పని తీరును పరీశీలించి అధికారులతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి మంజూరైన నిధులతో చారిత్రక కట్టడాలను సంరక్షించి, రాజ కాలువల్లో పేరుకు పోయిన పూడికతీతకు చర్యలను ముందుకు కొనసాగించాలన్నారు. ఈ సందర్భంగా నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, జిల్లాధికారి నితీష్‌, కమిషనర్‌ జుబీన్‌ మహాపాత్రో, శాంతప్ప, జయన్న, సాజిద్‌ సమీర్‌, బసవరాజ్‌ పాటిల్‌లున్నారు.

వైద్యుడు దేవుడితో సమానం

రాయచూరు రూరల్‌: సమాజంలో వైద్యుడు దేవుడితో సమానమని మానసిక వైద్య నిపుణుడు డాక్టర్‌ సీఆర్‌ చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ప్రైవేట్‌ హోటల్‌లో కళాసంకుల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్యుల దినోత్సవాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించి ఆయన మాట్లాడారు. వైద్యో నారాయణ హరి అనే పదానికి కట్టుబడి వైద్యులు రోగులకు తమదైన శైలిలో ఉత్తమ వైద్య సేవలను అందించాలన్నారు. మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలన్నారు. సమావేశంలో జిల్లా ఆరోగ్య అధికారి సురేంద్రబాబు, రిమ్స్‌ అధికారి రాహుల్‌, రేఖ, మారుతి, వెంకటేష్‌, శైలేష్‌ కుమార్‌, మనోహర్‌ పత్తార్‌, కృష్ణ, అమరేగౌడలున్నారు.

పౌష్టికాహారంతో ఆరోగ్యం

రాయచూరు రూరల్‌: పని ఒత్తిడిలో ఆరోగ్యం కాపాడుకోవాలని, ఉత్తమ ఆరోగ్యానికి పౌష్టికాహారం ముఖ్యమని మానసిక వైద్యనిపుణుడు డాక్టర్‌ సీఆర్‌ చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ప్రపంచ వైద్యుల దినోత్సవాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. సమాజంలో మానవుడు ఆరోగ్య రక్షణకు జాగ్రత్తలు పాటించాలన్నారు. నేటి సమాజంలో పని ఒత్తిడి వల్ల రక్తపోటు, సుగర్‌ వంటి వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. ప్రజలు డబ్బు సంపాదించాలనే యావలో ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించడం తగదన్నారు. విశ్వవిద్యాలయం సంచాలకురాలు స్మిత, అనిరుధ్‌, మనోహర్‌ పత్తార్‌, పాటిల్‌లున్నారు.

వీధి కుక్కలు, పశువుల బెడద అరికట్టండి

రాయచూరు రూరల్‌: నగరంలో అధికమవుతున్న వీధి కుక్కల స్వైర విహారం, రహదారుల్లో పడుకున్న పశువుల నియంత్రణకు ప్రాధాన్యత ఇవ్వాలని శాసన సభ్యుడు శివరాజ్‌ పాటిల్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరసభ కార్యాలయంలో నగరసభ కమిషనర్‌ జుబీన్‌ మహాపాత్రోతో కలిసి అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో రోజుకు రోజుకు అధికమైన కుక్కల బెడదతో పిల్లలను కరవడంతో భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు.

వేశ్యావాటికపై దాడి..

ఆరుగురు మహిళల అరెస్ట్‌

రాయచూరు రూరల్‌: నగరంలో ప్రైవేట్‌ వసతి గృహంలో వేశ్యావాటిక నిర్వహిస్తున్న సమాచారం అందుకున్న పోలీసులు దాడి జరిపి ఆరుగురు మహిళలు, మేనేజర్‌తో పాటు నలుగురిని అరెస్ట్‌ చేసినట్లు గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌ సీఐ సాబయ్య తెలిపారు. తాలూకాలోని కుకనూరు క్రాస్‌ వద్ద లాడ్జిపై పోలీసులు దాడి చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రకాష్‌ డంబళ్‌ తెలిపారు.

కార్మికుల సమస్యలు తీర్చరూ

రాయచూరు రూరల్‌: జిల్లాలో కట్టడ కార్మికుల సమస్యలపై స్పందించి పరిష్కరించాలని కట్టడ కార్మికుల సంఘం అధ్యక్షుడు వీరనగౌడ డిమాండ్‌ చేశారు. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో మాట్లాడారు. కట్టడ కార్మికులకు విద్యార్థి వేతనాలు, వివాహ సహాయధనం, పెన్షన్‌, వైద్య, అంత్యక్రియల ఖర్చులు చెల్లించాలని కోరుతూ కార్మిక అధికారి ఆరతికి వినతిపత్రం సమర్పించారు.

రాజ కాలువల అభివృద్ధికి ప్రాధాన్యత 1
1/5

రాజ కాలువల అభివృద్ధికి ప్రాధాన్యత

రాజ కాలువల అభివృద్ధికి ప్రాధాన్యత 2
2/5

రాజ కాలువల అభివృద్ధికి ప్రాధాన్యత

రాజ కాలువల అభివృద్ధికి ప్రాధాన్యత 3
3/5

రాజ కాలువల అభివృద్ధికి ప్రాధాన్యత

రాజ కాలువల అభివృద్ధికి ప్రాధాన్యత 4
4/5

రాజ కాలువల అభివృద్ధికి ప్రాధాన్యత

రాజ కాలువల అభివృద్ధికి ప్రాధాన్యత 5
5/5

రాజ కాలువల అభివృద్ధికి ప్రాధాన్యత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement