
రేణుక స్వామి హత్య కేసు మాదిరిగా కలబుర్గిలో మరో సంచలన కేసు
భార్య ఉన్నా మరొకరితో అనైతిక సంబంధం హత్యకు దారి తీసిన వైనం
రాయచూరు రూరల్(కర్ణాటక): నటుడు దర్శన్ గ్యాంగ్ చేతిలో రేణుక స్వామి హత్య కేసు మాదిరిగా రాష్ట్రంలో అలాంటిదే మరో హత్య కలబుర్గిలో జరిగింది. రేణుక స్వామి హత్య షెడ్డులో జరగగా, ఈ కేసులో రాఘవేంద్ర నాయక్‌ను గురురాజ్, అశ్విని, లక్ష్మీకాంత రావులు కలిసి శ్మశానంలో చంపి రాయచూరు సమీపంలోని కృష్ణా నదిలో మృతదేహాన్ని పడేసినట్లు నిందితులు నేరం అంగీకరించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను కలబుర్గిలో మంగళవారం విలేకరుల సమావేశంలో పోలీసు అధికారులు వెల్లడించారు.
అశ్విని, రాఘవేంద్ర నాయక్ మొదటి నుంచి స్నేహితులు. అశ్విని మరొకరితో స్నేహం చేయడంతో రాఘవేంద్ర నాయక్ కస్సుబుస్సుమనేవాడు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో గొడవ పడ్డారు. ఆమెను వదిలి పెట్టని రాఘవేంద్ర నాయక్ మొబైల్‌లో అశ్వినికి అశ్లీల సందేశాలు పంపడం, చిత్రహింసలు పెట్టడం చేశాడు. దీనిని సహించలేక గురురాజ్ అనే మిత్రుడికి ఆమె విషయం తెలిపింది. రాఘవేంద్ర నాయక్‌ను తుదముట్టడించడానికి ప్రణాళిక రచించారు. అతనిని కారులో కిడ్నాప్ చేసి కలబుర్గి కృష్ణానగర్ శ్మశాన వాటికలోకి తీసుకెళ్లారు.
మర్మాంగాన్ని కోసి హత్య
అతడిపై మారణాయుధాలతో దాడి చేసి మర్మాంగాన్ని కోసి హత్య చేశారు. సాక్ష్యం లభించరాదని భావించి రాయచూరు తాలూకా శక్తినగర సమీపంలో కృష్ణా నది వంతెన పైనుంచి నదిలోకి పారేసి చేతులు దులుపుకున్నారు. రాఘవేంద్ర నాయక్ కారవార నుంచి వచ్చి కలబుర్గిలో సురేఖను పెళ్లి చేసుకొని అక్కడే గణేష్ నగర్‌లో నివాసం ఉన్నారు. సూపర్ మార్కెట్ వద్ద హోటల్‌లో పని చేస్తున్న రాఘవేంద్ర నాయక్‌ను మార్చి 12న కిడ్నాప్ చేసి హత్య చేశారు. 14వ తేదీన మృతదేహం లభించింది. ఈ విషయంలో భర్త రెండు నెలలు గడిచినా ఇంటికి రాకపోవడంతో ఆమె మే 25న స్టేషన్ బజార్ పోలీçస్ స్టేషన్‌లో తప్పిపోయినట్లు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసుల విచారణలో రాఘవేంద్ర నాయక్ తనకు భార్య ఉన్నా మరొకరితో అనైతిక సంబంధం పెట్టుకోవడంతో అది వికటించగా, అశి్వనికి అశ్లీల సందేశాలు పంపడం, చిత్రహింసలు పెట్టడంతో తామే హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారని తెలిపారు.