
సంబరంగా ఆషాఢ గోరింటాకు పండుగ
సాక్షి,బళ్లారి: నిత్యం పని ఒత్తిడితో బిజిబిజీగా గడిపే మహిళలందరూ కలిసికట్టుగా ఆషాఢ మాసంలో గోరింటాకు పండుగను ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం ఆషాఢ మాసంలో నిర్వహించే గోరింటాకు పండుగను నగరంలోని ఎంఆర్‌వీ లేఅవుట్‌లోని డాక్టర్ సతీష్‌రెడ్డి ఇంటి సమీపంలో ప్రధాన రహదారిలో మహిళలకు పెద్ద సంఖ్యలో సంప్రదాయబద్ధంగా గోరింటాకును తయారు చేసుకుని, ఒకరికొకరు గోరింటాకు అంటించుకుని సంతోషంగా గడిపారు. ఈ సందర్భంగా ఎంఆర్‌వీ లేఅవుట్, హరిప్రియ లేఅవుట్, హెచ్‌ఎంటీ లేఅవుట్‌లకు చెందిన మహిళలు మాట్లాడుతూ మన సంస్కృతి వారసత్వాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలన్నారు. మహిళలకు గోరింటాకు పండుగ అంటే ఎంతో ఇష్టమన్నారు. అందరం కలిసి మెలసి ఒకే చోట చేరి పండుగ చేసుకోవడంతో స్నేహభావం పెంపొందుతుందన్నారు.

సంబరంగా ఆషాఢ గోరింటాకు పండుగ