
రేపు సాయి మందిరంలో ప్రత్యేక పూజలు
రాయచూరు రూరల్: నగరంలోని పబ్లిక్ గార్డెన్స్‌లోని సాయిబాబా ధ్యాన మందిరంలో ఈనెల 10న ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు సాయిబాబా ధ్యాన మందిరం ట్రస్టీ కిరణ్ ఆదోని తెలిపారు. మంగళవారం సాయిబాబా మందిరంలో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గురుపౌర్ణిమ సందర్భంగా 6 గంటలకు కాకడ హారతి, మహా రుద్రాభిషేకం, పుష్పాభిషేకం, సాయి సత్యనారాయణ పూజలు, పల్లకీ సేవలు, ధూపహారతి, అన్న దాసోహ కార్యక్రమాలను చేపడతారన్నారు. విలేఖర్ల సమావేశంలో ప్రవీణ్ ప్రభ శెట్టర్, కేశవమూర్తి, ఈరన్న, అన్వర్ పాషా, తానాజీలున్నారు.
శాంతించిన తుంగభద్ర
● జలాశయానికి తగ్గిన వరద నీరు
హొసపేటె: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జీవనాడి తుంగభద్ర జలాశయానికి ఎగువన నదీ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో డ్యాంకు వస్తున్న వరదనీరు నిలకడగా ఉంది. మంగళవారం డ్యాంలో నీటి నిల్వ 75.594 టీఎంసీలకు చేరుకోగా డ్యాం వద్ద 16 క్రస్ట్‌గేట్లను రెండున్నర అడుగుల మేర పైకెత్తి దిగువకు సుమారు 49 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం డ్యాంలో నీటిమట్టం 1624.83 అడుగులు, ఇన్‌ఫ్లో 52 వేల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 61,145 క్యూసెక్కులుగా ఉందని బోర్డు అధికార వర్గాలు తెలిపాయి.
యరగేరను తాలూకా
కేంద్రంగా ప్రకటించాలి
రాయచూరు రూరల్: రాయచూరు నుంచి 25 కి.మీ. దూరంలోని యరగేరను తాలూకా కేంద్రంగా ప్రకటించాలని యరగేర తాలూకా పోరాట సమితి అధ్యక్షుడు నిజాముద్దీన్ డిమాండ్ చేశారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు అనుకూలమయ్యే విధంగా తాలూకాను ఏర్పాటు చేయడానికి అన్ని విధాలుగాన సౌకర్యాలున్నాయని వివరించారు. యరగేర నుంచి 2 కి.మీ దూరంలో 256 ఎకరాల్లో ఆదికవి మహర్షి వాల్మీకి విశ్వవిద్యాలయం ఉందన్నారు. రాయచూరు నుంచి మంత్రాలయం, కర్నూలు, విజయవాడ, గుడివాడ, బెంగళూరు, ద్రాక్షారామ తదితర సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు జాతీయ రహదారి– 167 ఉందన్నారు. యరగేర పరిధిలో 19 గ్రామ పంచాయతీలు, 78 గ్రామాలు ఉన్నాయన్నారు. 2020 నుంచి యరగేరను తాలూకా కేంద్రంగా ప్రకటించాలంటూ ఆందోళన చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. విలేఖర్ల సమావేశంలో బసవరాజ్, మహబూబ్ పటేల్, విద్యానంద రెడ్డి, తాయప్ప, మహ్మద్ రఫీలున్నారు.
జిల్లాధికారికి అభినందన పత్రం
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాధికారి నితీష్‌కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభినందన పత్రం లభించింది. రాష్ట్రంలోని 31 జిల్లాలకు సంబంధించి జరిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనాధికారి సర్వేలో పథకాలను ప్రజలకు సక్రమంగా అందజేయడంలో తీసుకున్న చొరవకు అభినందనలను తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలిని రజనీష్ లేఖ రాశారు. భూసార పరీక్షలు, ప్రధానమంత్రి కృషి సంచయిని, మాతృ వందనం, జాతీయ వ్యవసాయ వికాస్, నరేగ, తోటల పెంపకం, వివిధ పథకాలను ప్రజలకు సక్రమంగా అందించడంలో చూపిన చొరవకు ఈ అభినందన పత్రం అందించారు.
చెత్త బట్వాడాపై అవగాహన
హొసపేటె: 31వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ తారిహళ్లి జంబునాథ వార్డులో తిరుగుతూ చెత్త పారవేయడానికి ఉచితంగా డస్ట్‌బిన్(చెత్తబుట్ట)లను పంపిణీ చేసి చెత్త విలేవారి గురించి అవగాహన కల్పించారు. తడి, పొడి చెత్తను ఇంట్లోనే వేరు చేసి చెత్త వాహనానికి ఇవ్వాలని ఆయన అన్నారు. వార్డు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం మనందరి ప్రాథమిక కర్తవ్యం అని, ప్రజలు సహకరించాలని అన్నారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రతి ఇంటికీ, అంతస్తుకు వెళ్లి తడి, పొడి చెత్త కోసం వేర్వేరుగా చెత్త బుట్టలను ఉచితంగా పంపిణీ చేశారు.
13న జమ్ముకశ్మీర్
ఆందోళనలో పాల్గొంటాం
హుబ్లీ: జమ్ముకశ్మీర్‌లో 5 లక్షల మంది హిందువులు పునర్నివసించేలా డిమాండ్ చేస్తూ ఈ నెల 13న జమ్ములో జరుగనున్న ప్రపంచ స్థాయి హిందూ పర సంఘాల సమావేశంలో శ్రీరామ సేన పాల్గొంటుందని ఆ సంస్థ జాతీయ అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ తెలిపారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడారు. హుబ్లీలో నేహా హిరేమఠ హత్య జరిగి ఏడాది గడిచినా ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరలేదన్నారు.

రేపు సాయి మందిరంలో ప్రత్యేక పూజలు

రేపు సాయి మందిరంలో ప్రత్యేక పూజలు

రేపు సాయి మందిరంలో ప్రత్యేక పూజలు

రేపు సాయి మందిరంలో ప్రత్యేక పూజలు