
జెడ్పీ సీఈఓ రాహుల్ కలబుర్గికి బదిలీ
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా పంచాయతీ ముఖ్య కార్య నిర్వహణాధికారి రాహుల్ తుకారాం పాండేను కలబుర్గి డివిజన్ విద్యా శాఖ కమిషనర్‌గా బదిలీ చేస్తున్నట్లు మంగళవారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ప్రధాన కార్యదర్శి మహంతేష్ ఓ ప్రకటనలో వెల్లడించారు. రాయచూరు జెడ్పీ సీఈఓగా కారవార జెడ్పీ సీఈఓగా విధులు నిర్వహిస్తున్న ఈశ్వర్ కుమార్‌ను నియమించారు. బాగల్‌కోటె జెడ్పీ సీఈఓగా కలబుర్గి డివిజనల్ విద్యా శాఖ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆకాష్‌ను నియమించారు. యాదగిరి జిల్లాధికారిణిగా విధులు నిర్వహిస్తున్న సుశీలను కలబుర్గి డివిజనల్ కేఎస్‌ఆర్‌టీసీ ఎండీగా, యాదగిరి జిల్లాధికారిగా అటల్ జన స్నేహి డైరెక్టర్ బీహెచ్.నారాయణరావ్‌ను, బాగల్‌కోటె జెడ్పీ సీఈఓ శశిధర్ కురేరాను బెంగళూరు కేయూఐడీబీ ఎండీగా బదిలీ చేశారు.

జెడ్పీ సీఈఓ రాహుల్ కలబుర్గికి బదిలీ

జెడ్పీ సీఈఓ రాహుల్ కలబుర్గికి బదిలీ

జెడ్పీ సీఈఓ రాహుల్ కలబుర్గికి బదిలీ