
ముదగల్‌లో పీర్ల దేవుళ్ల ఊరేగింపు
రాయచూరు రూరల్: ముదగల్‌లో నిర్వహించే మొహర్రం వేడుకలు హిందూ, ముస్లింల భావైక్యతకు ప్రతీకగా నిలుస్తున్నాయి. వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఏటా మొహర్రం ఉత్సవాలు కొనసాగుతున్నాయి. పీర్ల దేవుళ్లను ఇరాన్ దేశం నుంచి ముదుగల్‌కు తీసుకోచ్చి కొలువుదీర్చినట్లు భక్తుల నమ్మకం. మొహర్రం సందర్భంగా కొలువు దీర్చిన పీర్లను దర్శించుకునేందుకు స్థానికులతోపాటు ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివస్తున్నారు. శనివారం రాత్రి అగ్నిగుండం వెలిగించగా భక్తులు అందులోకి కొబ్బరి, చక్కెర వేసి మొక్కులు తీర్చుకున్నారు. ముస్లింలతోపాటు హిందువులు పీర్ల దేవుళ్ల చావడి వద్ద ఆలం తొక్కుతూ ఆనందంలో మునిగిపోతున్నారు.
శాంతియుతంగా ఆచారించాలి
మోహర్రంను శాంతియుతంగా అచరించాలని జిల్లా ఎస్ప పుట్ట మాదయ్య సూచించారు. లింగసూగురు తాలుకా హట్టి, ముదుగల్, సింధనూరు తాలూకా క్యాంప్ సిరవారలో మొహర్రంను హిందూ ముస్లింలు కలిసిమెలసి నిర్వహించుకోవాలని సూచించారు.
హొసపేటె: పీర్ల పండుగను నగర వాసులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు పీర్ల మందిరానికి వెళ్లి చెక్కర, బెల్లం పొడిని చదివించారు. చిత్తవాడిగి, రామటాకీస్, అజాడ్ నగర్ తదితర చోట్ల పీర్ల దేవుళ్లను కూర్చోపెట్టారు.

ముదగల్‌లో పీర్ల దేవుళ్ల ఊరేగింపు

ముదగల్‌లో పీర్ల దేవుళ్ల ఊరేగింపు