
రేపు ఆయుర్వేద కౌశల్య శిబిరం
రాయచూరు రూరల్: నగరంలో ఈనెల 5న అయుర్వేద రస కౌశల్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు పూర్ణిమా ఆయుర్వేద వైద్య కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. గురువారం కళాశాల భవనంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. వనమూలికల ద్వారా రస కౌశల్య శిబిరాన్ని రాజీవ్‌గాంధీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రిన్సిపాల్ బీఎస్ సవది ప్రారంభిస్తారన్నారు. కళాశాల ఆవరణలో 250 ఔషధ మొక్కలను నాటుతారన్నారు. పంచకర్మ పద్ధతిలో వివిధ రకాల వ్యాధులకు చికిత్స చేయడానికి అన్ని విధాలుగా సౌకర్యాలను సమకూర్చామన్నారు. కేశవరెడ్డి, శివకుమార్, ఆయుష్ అధికారి శంకరగౌడ, మహేశ్వరస్వామిలతో పాటు రాష్ట్ర నలు మూలల నుంచి 300కు పైగా ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. వైద్యులు నందా, అంబిక, ప్రత్యూష, బసవరాజ్‌లున్నారు.
జెడ్పీ సీఈఓకు
సర్కార్ అభినందన పత్రం
రాయచూరు రూరల్: రాయచూరు జెడ్పీ సీఈఓ రాహుల్ తుకారాం పాండేకు రాష్ట్ర ప్రభుత్వం అభినందన పత్రం జారీ చేసింది. బుధవారం రాష్ట్రంలోని 31 జిల్లాలకు జరిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనాధికారి సర్వే పథకాలను ప్రజలకు సక్రమంగా అందచేయడంలో తీసుకున్న చొరవకు అభినందనలను తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలిని రజనీష్ లేఖ రాశారు. భూసార పరీక్షలు, ప్రధానమంత్రి కృషి సంచయిని, మాతృవందనం, జాతీయ వ్యవసాయ వికాస్, నరేగ, తోటల పెంపకం, వివిధ పథకాలను ప్రజలకు సక్రమంగా అందించడంలో చూపిన చొరవకు అభినందనపత్రం అందించారు.
హళకట్టి ఆశయాలు అనుసరణీయం
రాయచూరు రూరల్: వచన సాహితీవేత్త హళకట్టి ఆశయాలు, ఆదర్శాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని ీతహసీల్దార్ సురేష్ వర్మ అన్నారు. పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో వచన సాహితీవేత్త హళకట్టి జయంతి సందర్భంగా జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, నగరసభ, సాంఘీక సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడారు. నేటి ఆధునిక సమాజంలో అణగారిపోతున్న సాహిత్యాన్ని కాపాడుకోవాలన్నారు.
వైద్యుడి బదిలీ రద్దుకు వినతి
హొసపేటె: నగరంలోని వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు సోమశేఖర్ కబ్బేరను ఎట్టి పరిస్థితిలోనూ బదిలీ చేయరాదని డిమాండ్ చేస్తూ భగత్‌సింగ్ బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ నేతృత్వంలో గురువారం విజయనగర జిల్లాధికారి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖాధికారి డాక్టర్ శంకర్ నాయక్, ఆస్పత్రి వైద్యాధికారి డాక్టర్ హరిప్రసాద్‌లకు వినతిపత్రాన్ని అందజేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు కేఎం.సంతోష్ కుమార్‌తో పాటు నాయకులు, రక్తదాతలు ఎస్.విజయ్‌కుమార్, సీ.ప్రకాష్, హనుమంతప్ప, చెన్నబసవనగౌడ, బీఎస్.రుద్రప్ప, ఎం.సుభాష్, కే.పునీత్‌కుమార్, వెంకటేష్ కులకర్ణి, ఫయాజ్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి సమావేశం దోహదం
హొసపేటె: ఎస్సీ, ఎస్టీ ప్రజల సమస్యలను వినడానికి, పరిష్కారాలను సూచించడానికి నగరంలో ఎస్పీ కార్యాలయంలో గురువారం సమావేశం ఏర్పాటు చేశారు. ఎస్పీ శ్రీహరిబాబు మాట్లాడుతూ ఫిర్యాదు సమావేశాలు నిర్వహించడం వల్ల సమస్యల పరిష్కారం సాధ్యమన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్‌లో నెలకొకసారి, జిల్లా స్థాయిలో ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా ఎస్పీ నేతృత్వంలో సమావేశాలు జరుగుతున్నాయన్నారు. జిల్లా స్థాయిలో ప్రతి మూడు నెలలకు ఒకసారి కమిషనర్ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీల కోసం జిల్లా అవగాహన పర్యవేక్షణ కమిటీ సమావేశం జరుగుతోందన్నారు. ఎస్సీ, ఎస్టీల కాలనీల్లో అనేక సమస్యలు ఉన్నాయని, సమావేశం దృష్టికి తెచ్చిన తర్వాత కూడా పరిష్కారం దొరకడం లేదని దళిత నాయకులు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ మంజునాథ్, కూడ్లిగి డీఎస్పీ మల్లేష్ దొడ్డమని, దళిత, వాల్మీకి సమాజ నేతలు పాల్గొన్నారు.

రేపు ఆయుర్వేద కౌశల్య శిబిరం

రేపు ఆయుర్వేద కౌశల్య శిబిరం

రేపు ఆయుర్వేద కౌశల్య శిబిరం