
దూద్‌సాగర్.. సందర్శకులపై నజర్
హుబ్లీ: కర్ణాటక సరిహద్దు సమీపంలోని గోవాలోని దూద్‌సాగర్ జలపాతం ప్రస్తుతం నిండుకుండలా ప్రవహిస్తోంది. పర్యాటకులను రారమ్మని పిలుస్తోంది. అయితే పర్యటనకు వెళ్లిన వారు అక్కడి కొన్ని సూక్ష్మ ప్రాంతాల్లో నియమాలను ఉల్లంఘించి ప్రాణాల మీదుకు తెచ్చుకుంటున్నారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు సందర్శకులు తప్పకుండా తగిన నియమాలను పాటించాలని, ముఖ్యంగా సొరంగాలు, లోయలు, అడవి జంతువుల వల్ల అపాయం ఉందని సూచించారు. ఆర్‌పీఎఫ్ సిబ్బంది నిఘాలో సందర్శకులు నియమాలను పాటించాలి. క్యాసల్‌రాక్ రైల్వే స్టేషన్ ఆవరణలోకి అక్రమంగా ప్రవేశించరాదు. అలా అక్రమంగా ప్రవేశించిన 21 మందిని అరెస్ట్ చేసి వీరిపై కేసులు దాఖలు చేశారు. అరెస్ట్ అయిన వారిని బెయిల్‌పై విడుదల చేసి జరిమానా విధిస్తూ హుబ్లీ ప్రత్యేక జుడీషియల్ మేజిస్ట్రేట్ రైల్వే కోర్టు ఈ మేరకు ఆంక్షలు విధించింది. సందర్శకులు యశ్వంత్‌పుర–వాస్కో ఎక్స్‌ప్రెస్ ద్వారా ఘటన స్థలానికి వచ్చి రైలు పట్టాల పొడవునా నడుచుకుంటూ జలపాతం వద్దకు వెళ్లే వారు. భద్రత కారణాలతో దీన్ని కట్టుదిట్టంగా నిషేధించారు. సందర్శకులు రైలు పట్టాలపై నడవరాదని హుబ్లీ నైరుతి రైల్వే పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.

దూద్‌సాగర్.. సందర్శకులపై నజర్