
రేవ్ పార్టీకి ఖాకీల బ్రేక్
దొడ్డబళ్లాపురం: దేవనహళ్లి ఎయిర్‌పోర్టు సమీపంలో కన్నమంగల వద్ద ఉన్న ఫాంహౌస్‌లో రేవ్ పార్టీపై దేవనహళ్లి పోలీసులు ఆదివారంనాడు దాడి చేసి 10 మంది యువతులు, 20 మంది యువకులను అరెస్టు చేశారు. అందరూ శనివారం ఉదయం నుంచే మజా చేస్తున్నట్లు తెలిసి పోలీసులు సోదాలు జరిపారు. అందరినీ నిర్బంధించి సోదాలు చేశారు. నిషేధిత మత్తు పదార్థాలు లభించినట్లు సమాచారం. వారికి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎయిర్‌పోర్టుకు అతి సమీపంలో ఉన్న ఫాంహౌస్‌లో రేవ్ పార్టీ జరగడం చర్చనీయాంశంగా మారింది. పార్టీలో పాల్గొన్నవారు బడాబాబులని, అమ్మాయిలను పిలిపించి నృత్యాలు, మద్యం తదితరాలతో జల్సా చేసినట్లు సమాచారం. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పెద్దసంఖ్యలో కార్లు, బైక్‌లు, మొబైళ్లు తదితరాలను సీజ్‌చేశారు.
ఎయిర్‌పోర్టు వద్ద
ఫాంహౌస్‌పై దాడి

రేవ్ పార్టీకి ఖాకీల బ్రేక్