
● ఘరానా ముఠా అరెస్ట్
మద్యం మత్తులో ఉన్న వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా ఓ పెద్ద నేర ముఠా గుట్టు రట్టయింది. ముగ్గురు మహిళలతో పాటు ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి 20 రోజులు పసికందును కాపాడారు. కణ్ణన్ రామస్వామి, మురుగేశ్వరి, సుహాసిని, శరణ్య, హేమలత అనే ఐదుమంది పట్టుబడ్డారు. మహాలక్ష్మీ, గోమలి, రాధామణి అనే ముగ్గురిని విచారిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ 8 మందిపై బెంగళూరు రాజరాజేశ్వరినగర పోలీస్‌స్టేషన్‌లో పిల్లల దొంగరవాణా కేసు నమోదు చేశారు.
● సాధారణంగా శిశువులను, బాలలను విక్రయిస్తుంటారు. కానీ వీరు నిరుపేద గర్భిణులను గుర్తించి, పుట్టబోయే బిడ్డను తమకు ఇవ్వాలని డబ్బు ఆశ చూపేవారు. పసికందులకు ఎక్కువ డిమాండ్ ఉండటాన్ని గుర్తించిన వంచకుల గ్యాంగ్ తమ నెట్‌వర్క్‌తో దందా నిర్వహిస్తున్నారు.
● నవజాత శిశువును తీసుకుని ఇతరులకు ఎక్కువ రేటుకు అమ్ముకునేవారు. మురుగేశ్వరి అనే పేద గర్భవతికి అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చి శిశు విక్రయ ఒప్పందం కుదుర్చుకున్నారు.
● ఈ సమాచారం ఆధారంగా ఆర్‌ఆర్.నగర దేవస్థానం వద్ద మకాం వేసిన పోలీసులకు తమిళనాడు రిజిస్ట్రేషన్ కలిగిన కారు రాగా, అడ్డుకుని నిందితులను అరెస్ట్ చేశారు.
● 20 రోజులు పసికందుతో పాటు తమిళనాడు కు చెందిన ముగ్గురు మహిళలు, ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
● పసికందులను రూ.25 వేల నుంచి 30 వేలకు కొనుగోలు చేసి సంతానం లేని శ్రీమంత కుటుంబాలకు రూ.8 – 10 లక్షలకు విక్రయిస్తున్నట్లు విచారణలో బయటపడింది.
●ముఠాలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రానికి చెందిన పేరుపొందిన డాక్టర్లు, ఆసుపత్రుల భాగస్వామ్యం ఉన్నట్లు తెలియడంతో సీసీబీచే దర్యాప్తు చేయిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.

అరెస్టయిన నిందితులు
