
వీలింగ్ చేస్తూ పట్టు బడిన యువకులు
హోసూరు వార్తలు..
హోసూరు: జాతీయ రహదారిపై ప్రమాదకరంగా వీలింగ్ చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. హోసూరు డీఎస్పీ ప్రశాంత్‌బాబు నేతృత్వంలో పోలీసులు హోసూరు–బెంగళూరు, హోసూరు–క్రిష్ణగిరి జాతీయ రహదార్లపై గస్తీ తిరుగుతుండగా ద్విచక్ర వాహనాల్లో వీలింగ్ చేస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో హోసూరు పార్వతీనగర్‌కు చెందిన ముహమ్మద్ అపేరార్ (22) అప్పుఖాన్ (23), మహమ్మద్‌ఆలీ (19)లను అరెస్ట్ చేసి వారి డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు చేశారు. మరో ముగ్గురు చిన్నారులు కావడంతో వారికి తలా రూ. 25 వేలు జరిమానా విధించి 25 ఏళ్ల వరకు లైసెన్స్‌లు పొందేందుకు అర్హత లేకుండా చేశారు. రోడ్లపై వీలింగ్ చేస్తే ప్రజలు వెంటనే 638329123 నంబర్‌కు వాట్సప్ చేయాలని, సమాచారం అందజేసే వారి వివరాలను రహస్యంగా ఉంచుతామని డీఎస్పీ బాబు ప్రశాంత్ తెలిపారు.

మిరపకాయలతో యాగం నిర్వహిస్తున్న దృశ్యం