ఆటో డ్రైవర్లకు రూ.3.36 లక్షల జరిమానాలు | - | Sakshi
Sakshi News home page

ఆటో డ్రైవర్లకు రూ.3.36 లక్షల జరిమానాలు

Sep 25 2023 12:48 AM | Updated on Sep 25 2023 7:47 AM

- - Sakshi

ఆటో డ్రైవర్లపై పదే పదే ఫిర్యాదులు వినిపిస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక కార్యచరణ

కర్ణాటక: ఆటో డ్రైవర్లపై పదే పదే ఫిర్యాదులు వినిపిస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక కార్యచరణ చేపట్టారు. ఈనెల 14నుంచి 23వరకు మొత్తం 670 కేసులు నమోదు చేసి వారినుంచి రూ.3.36 లక్షల జరిమానా వసూలు చేశారు. అధిక చార్జీల వసూళ్లకు సంబంధించి ఈశాన్య ఉప విభాగంలో 141 మంది డ్రైవర్లపై కేసు నమోదు చేసి రూ.72వేలు, ఉత్తర ఉప విభాగంలో 213 మందిపై కేసులు నమోదు చేసి రూ.1.06లక్షల జరిమానా వసూలు చేశారు.

అదేవిధంగా ప్రయాణికులు చెప్పిన చోటుకు రాని డ్రైవర్లకు కూడా జరిమానా విధించారు. 95 మందిపై కేసులు నమోదు చేసి రూ.47,500, ఉత్తర ఉప విభాగంలో 221 మందిపై కేసులు నమోదు చేసి రూ.1.10 లక్షల జరిమానా విధించారు.

Advertisement
 
Advertisement
Advertisement