
పెయింటింగ్స్ పరిశీలిస్తున్న దృశ్యం
బనశంకరి: చిత్రకళా పరిషత్‌లో డ్రిజ్‌లింగ్‌కలర్ పేరుతో కొలువుదీరిన పెయింటింగ్స్ ప్రదర్శన నగరవాసులను అబ్బురపరుస్తోంది. కుమార కృపరోడ్డు చిత్రకళా పరిషత్ గ్యాలరీ–4లో వసంతా ఆర్ట్స్ సీనియర్ ఆర్టిస్ట్ ప్రవాసాంధ్రుడు కే.మాల్యాద్రి ఆధ్వర్యంలో పెయింటింగ్స్ ప్రదర్శనలో కళాకృతులు సందర్శకులను ఆహో అనిపిస్తున్నాయి. కర్ణాటకకు చెందిన 13 మంది వర్దమాన కళాకారులు ప్రకృతి, పర్యావరణం, వన్యజీవులు, దేవతలను ఇతివృత్తంగా చేసుకుని తమ మనసులోని భావాలకు జీవం పోశారు. కళాకారిణి ఆర్తిఅశోక్ గీసిన శ్రీకృష్ణుడి చిత్రం, పూర్ణిమా అరవింద్ అద్భుతంగా గీసిన గౌతమబుద్ధుడు పెయింటింగ్స్ విభిన్నంగా ఉన్నాయి. ప్రకృతి పర్యావరణంపై ఎస్‌డీ. విద్య, దీప్తిశనాయ్ అనే కళాకారులు ఎంతో అద్బుతంగా గీశారు. ఓవెన్ శివానంద్ గీటారు పెయింటింగ్ ఎంతో చక్కగా గీశారు. స్వాతి ప్రదీప్ గౌతమబుద్ధుడి చిత్రాలు విభిన్నశైలిలో రూపకల్పన చేశారు. పీయూసీ విద్యార్థిని రీత్‌బెహతి అద్దంలో నుంచి గద్ద బయటికి వచ్చే పెయింటింగ్ ఎంతో అందంగా గీశారు. గీతాప్రకాష్ గీసిన ఏనుగు పెయింటింగ్ ప్రదర్శనలో హైలెట్‌గా నిలిచింది. ఈ ప్రదర్శన 24 తేదీ వరకు నిర్వహిస్తారు.

చిత్రాలను పరిశీలిస్తున్న సందర్శకులు

ఆకట్టుకుంటున్న త్రీడీ పెయింటింగ్