క్రిష్ణగిరి: జిల్లా కేంద్రం క్రిష్ణగిరిలో నిర్వహిస్తున్న ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో చికెన్ రైస్ తిన్న 26 మంది కార్మికులు అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరారు. వివరాలు. క్రిష్ణగిరి దగ్గర కురుబరపల్లిలో నిర్మాణమవుతున్న కొత్త ఫ్యాక్టరీలో కోల్‌కతాకు చెందిన కార్మికులు పనిచేస్తున్నారు. బుధవారం రాత్రి క్రిష్ణగిరి కే.థియేటర్ సమీపంలో నిర్వహిస్తున్న ఓ హోటల్ నుంచి చికెన్‌రైస్ తెచ్చుకొని తిన్నారు. వెంటనే కడుపునొప్పి, వాంతులతో 26 మంది అస్వస్థతకు గురయ్యారు. గమనించిన స్థానికులు వీరిని వెంటనే చికిత్స కోసం క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆహార భద్రతా శాఖాధికార్లు వెంటనే హోటల్‌లో తనిఖీలు చేసి యజమాని చెన్నప్పను అరెస్ట్ చేశారు.


