
రోడ్డు ప్రమాదంలో బ్యాంకు ఉద్యోగిని మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
కర్ణాటక : రోడ్డు ప్రమాదంలో బ్యాంకు ఉద్యోగిని మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈఘటన విరాజిపేటె–అమ్మత్తి రోడ్డులో ఉన్న సుంకదకట్టె వద్ద జరిగింది. కేరళలోని త్రిశూర జిల్లాకు చెందిన అమృత(24) కెనరాబ్యాంకు అమ్మత్తి శాఖలో విధులు నిర్వహిస్తోంది.
విరాజ్‌పేటలో నివాసం ఉంటోంది. ఆమె స్కూటీలో వెళ్తుండగా బిళగుంద గ్రామానికి చెందిన విఠల స్కూటీతో ఎదురైంది. వాహనాలు పరస్పరం ఢీకొనడంతో ఆమృత తీవ్రంగా గాయపడి మృతి చెందింది. మరో మహిళ విఠల గాయపడగా ఆస్పత్రికి తరలించారు. విరాజిపేట పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.