
ముందు వెళుతున్న లారీని బైక్ ఢీకొన్న ప్రమాదంలో పంచాయతీ కార్యదర్శి మృతి చెందిన ఘటన కెలమంగలం దగ్గర చోటు చేసుకొంది.
కెలమంగలం: ముందు వెళుతున్న లారీని బైక్ ఢీకొన్న ప్రమాదంలో పంచాయతీ కార్యదర్శి మృతి చెందిన ఘటన కెలమంగలం దగ్గర చోటు చేసుకొంది. వివరాల మేరకు జే. కారుపల్లికి చెందిన సత్యప్ప కొడుకు సురేష్ (47). హోసూరులో నివాసముంటూ మాచినాయకనపల్లి పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు.
శనివారం మధ్యాహ్నం హోసూరు నుంచి మాచినాయకనపల్లికి బైక్ మీద వెళుతూ గోపనపల్లి వద్ద ముందు వెళుతున్న లారీని ఢీకొని కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలేర్పడిన సురేష్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. హోసూరు సమితి గ్రామపంచాయతీల కార్యదర్శులు సంతాపం తెలిపారు.