గ్రామాల వైపు ఏనుగుల రాక

తళి ప్రాంతంలో సంచరిస్తున్న ఏనుగులు  (ఫైల్‌)
 - Sakshi

కెలమంగలం: తళి సమీపంలోని అటవీ ప్రాంతంలో మకాం వేసిన ఏనుగుల మంద నుంచి 5 ఏనుగులు విడిపోయి గ్రామాలవైపు చొరబడడంతో ఆ ప్రాంతంలో భయం నెలకొంది. తళి నియోజకవర్గానికి ఆనుకుని ఉన్న కర్ణాటక రాష్ట్రం బన్నేరుగట్ట అటవీ ప్రాంతం నుంచి వందకుపైగా ఏనుగులు జవుళగిరి అడవుల్లోకి వచ్చాయి. ఇప్పుడు అక్కడ 50 కి పైగా ఏనుగులకు పైగా మకాం వేశాయి. ఇందులో 5 ఏనుగులు విడిపోయి తళి సమీపంలోని దేవగానపల్లి గ్రామానికి చొరబడి సమీపంలోని తైలం తోపులో తిరుగుతున్నాయి. స్థానికులు అటవీ శాఖాధికార్లకు సమాచారం అందజేశారు. వారు వచ్చి టపాసులు పేల్చి ఏనుగులను దట్టమైన అటవీ ప్రాంతానికి మళ్లించారు. ఈ ఏనుగులు మళ్లీ గ్రామాలవైపు చొరబడే అవకాశం ఉందని, స్థానిక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top