పనస కాయలు రూ.4.33 లక్షలు | - | Sakshi
Sakshi News home page

పనస కాయలు రూ.4.33 లక్షలు

Mar 26 2023 1:24 AM | Updated on Mar 26 2023 8:01 AM

మసీదులో కాసిన పనస   - Sakshi

మసీదులో కాసిన పనస

పనస చెట్టుకు కాసిన కాయలు ఏకంగా రూ.4.33 లక్షలు పలికి అందరినీ ఆశ్చర్య పరిచాయి.

యశవంతపుర: దక్షిణ కన్నడ జిల్లా బంట్వాళ మూలరపట్ల మసీదులోని ఒక పనస చెట్టుకు కాసిన కాయలు ఏకంగా రూ.4.33 లక్షలు పలికి అందరినీ ఆశ్చర్య పరిచాయి. మూలరపట్లకు చెందిన సీరాజుద్దీన్‌ ఖాసిమి పత్తనాపురం మసీదులో కాసిన పనస చెట్టుకు కాసిన పండ్లను వేలం వేశారు. ఇందులో అజాజ్‌, లతీఫ్‌ అనే ఇద్దరు వ్యక్తులు పోటీ పడగా లతీఫ్‌ రూ.4.33 లక్షలకు వేలం దక్కించుకున్నాడు.

పనస కాయలను వేలం వేసిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. పెద్ద మొత్తంలో పనస కాయలు వేలంలో పలకటంపై ఆశ్చర్యం కలిగిస్తోంది. వచ్చిన ఆదాయాన్ని మసీదు ఖాతాలో జమ చేస్తామని మసీదు నిర్వాహకులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement