బనశంకరి: రాష్ట్ర విధానసభ ఎన్నికలకు ఏ క్షణంలో అయినా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఎన్నికల నియమావళి అమలుకు సిద్ధంగా ఉండాలని జిల్లాకలెక్టర్లుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచించింది. ఎన్నికలు ఏప్రిల్ లేదా మేనెలలో జరుగుతాయని, ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడానికి ఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలు చేయాలని పేర్కొంది. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లుచేసుకోవాలని జిల్లా కలెక్టర్లకు, బీబీఎంపీ కమిషనర్‌కు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. రాజకీయ పార్టీలు సార్వజనీక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించాలని ఆదేశించారు. కోడ్ నిబంధనలకు అనుగుణంగా అవసరమైన సమాచారంతో కూడిన బుక్‌లెట్‌ను జిల్లా కలెక్టర్లుకు పంపించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే మద్యం, డబ్బు, బహుమతుల రవాణాను అడ్డుకోవాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో రాజకీయపార్టీల సభలు సమావేశాలు నిర్వహించకుండా చూసుకోవాని తెలిపారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఖర్చు, వ్యయం పట్ల నిఘా పెట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సూచించారు.
ఏ క్షణంలో అయినా విధానసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్
జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనలు