కరీంనగర్ టౌన్: సింగరేణి పరిరక్షణ లక్ష్యంగా ఈనెల 14న రామగుండంలో నిర్వహించే బీఆర్‌ఎస్ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చా రు. సోమవారం తన నివాసంలో జిల్లా ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. సభకు ఉమ్మడి జిల్లా నుంచి పెద్దసంఖ్యలో తరలివెళ్లాలని నిర్ణయించారు. కరీంనగర్ నుంచి సుమారు 250 నుంచి 300 కార్లతో రామగుండానికి ర్యాలీగా వెళ్లేందుకు ప్రణాళిక రూపొందించారు. మధ్యాహ్నం కేటీఆర్‌తో కలిసి రామగుండం సభకు వెళ్లాలని నిర్ణయించారు. పార్టీ ముఖ్య నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తమ వాహనాలతో ఉదయం 11 నుంచి 12 గంటలలోపు కరీంనగర్‌కు చేరుకోవాలని గంగుల కమలాకర్ కోరారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు సర్దార్ రవీందర్‌సింగ్, అనిల్‌కుమార్ గౌడ్ పాల్గొన్నారు.


