కో ఆప్షన్‌ కుదిరేనా? | - | Sakshi
Sakshi News home page

కో ఆప్షన్‌ కుదిరేనా?

Oct 13 2026 12:11 AM | Updated on Oct 13 2026 12:11 AM

రేపు చొప్పదండి మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక

ఇప్పటికే పలుమార్లు వాయిదా

కౌన్సిలర్ల మధ్య కుదరని ఏకాభిప్రాయం

చొప్పదండి: మున్సిపల్‌ ఎన్నికలు జరిగి ఎనిమిది నెలలు కావస్తున్నా చొప్పదండిలో కోఆప్షన్‌ ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఎవరిని ఎన్ను కుందామనే అంశంపై ఏకాభిప్రాయం కుదరకపోవ డంతో పలుమార్లు వాయిదా వేశారు. ఈ నెల 14న మరోసారి కోఆప్షన్‌ ఎన్నికకు మున్సిపల్‌ అధికారులు ఏర్పాట్లు చేయడంతో ఉత్కంఠ నెలకొంది.

కాంగ్రెస్‌కు మెజారిటీ

మున్సిపల్‌ ఎన్నికల్లో 14వార్డులకు 10వార్డులు కాంగ్రెస్‌ గెలుపొందింది. 3 వార్డులు బీజేపీ, మరో వార్డును బీఆర్‌ఎస్‌ గెలుచుకున్నాయి. చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ పదవులు కాంగ్రెస్‌ కౌన్సిలర్లనే వరించాయి. తరువాత ఇద్దరు మాజీ ప్రజా ప్రతినిధులు, ఇద్దరు మైనారిటీలకు కేటాయించిన నాలుగు కోఆప్షన్‌ పదవుల కోసం అధికారులు నోటిఫికేషన్‌ ఇచ్చారు. మైనారిటీ పదవుల కోసం తొమ్మిది మంది, అనుభవజ్ఞులైన మాజీ ప్రజా ప్రతినిధుల పదవుల కోసం నలుగురు దరఖాస్తు చేసుకున్నారు. ఏకగ్రీవం చేసే ప్రక్రియ విఫలం కావడంతో ఎన్నికల వరకు వెళ్లిది. మైనారిటీ కోఆప్షన్‌ పదవుల విషయంలో కౌన్సిలర్లు రెండు వర్గాలుగా విడిపోవడంతోనే ఎన్నిక వాయిదా పడుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా అధికారంలో లేనప్పుడు పార్టీ కోసం తిరిగిన వారిని కాదని కొత్తవారికి ఎలా పదవులు ఇస్తారని సీనియర్లు వాపోతున్నారు. దీంతో బుధవారం జరిగే ఎన్నికల ప్రక్రియపై అయోమయం నెలకొంది. మున్సిపల్‌ కార్యాలయంలో ఈనెల 14న ఉదయం 11 గంటలకు కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ప్రక్రియను నిర్వహిస్తామని మున్సిపల్‌ కమిషనర్‌ నాగరాజు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement