కేసులు పెండింగ్‌ ఉండొద్దు | - | Sakshi
Sakshi News home page

కేసులు పెండింగ్‌ ఉండొద్దు

Oct 13 2026 12:11 AM | Updated on Oct 13 2026 12:11 AM

కరీంనగర్‌క్రైౖం: కేసులు వేగంగా పరిష్కరించాలని సీపీ గౌస్‌ ఆలం ఆదేశించారు. సోమవారం కమిషనరేట్‌ కార్యాలయంలో నేర సమీక్ష నిర్వహించారు. మ హిళలు, చిన్నారులపై నేరా లు, పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తుపై దృష్టి సారించాలన్నారు. ఈ–సమ్మన్స్‌, ఈ–సాక్ష్య, సీసీటీఎన్‌ఎస్‌ 2.0 వ్యవస్థల వినియోగంపై సమీక్షించారు. ఏసీపీలు శ్రీనివాస్‌ జి.వెంకటస్వామి, విజయకుమార్‌, యాదగిరిస్వామి, స్వామి, శ్రీనివాస్‌, మాధవి, వాసాల సతీశ్‌, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

తిమ్మాపూర్‌ సీఐగా అనిల్‌

తిమ్మాపూర్‌: తిమ్మాపూర్‌ సర్కిల్‌ సీఐగా రామగుండం సీసీఆర్బీలో పనిచేస్తున్న బర్ల అనిల్‌ నియామకం అయ్యారు. ఈ మేరకు సోమవారం రాత్రి బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ఎస్సై అరుణ్‌ స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ పనిచేస్తున్న సీఐ బొల్లం రమేశ్‌ సస్పెండ్‌ కావడంతో ఆయన స్థానంలో అనిల్‌ బదిలీపై వచ్చారు. అనిల్‌ గతంలో పెద్దపల్లి ట్రాఫిక్‌ సీఐగా పని చేశారు.

సీఈసీ రాజీనామా చేయాలి

కరీంనగర్‌టౌన్‌: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం టా ర్చ్‌లైట్‌ మార్చ్‌ నిర్వహించారు. బస్టాండ్‌ నుంచి గీతాభవన్‌ చౌరస్తా వరకు ప్రదర్శన చేపట్టారు. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వాసుదేవరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకర సంపత్‌, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎడ్ల రమేశ్‌ మాట్లాడుతూ జ్ఞానేశ్‌కుమార్‌ ఎన్నికల కమిషనర్‌గా కాకుండా బీజేపీ, ప్రధాని మోదీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రాయికంటి శ్రీనివాస్‌, యువజన సంఘం జిల్లా కార్యదర్శి డి.నరేశ్‌ పటేల్‌, విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్‌, కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి తిప్పారపు సురేశ్‌ పాల్గొన్నారు.

క్వింటాల్‌ పత్తి రూ.9,090

జమ్మికుంట: జమ్మికుంట మార్కెట్లో పత్తి ధరలు పెరుగుతున్నాయి. గత శుక్రవారం క్వింటాల్‌కు గరిష్ట ధర రూ.8,620 ఉండగా.. సోమవారం నాటికి రూ.470 పెరిగి రూ.9,090 పలి కింది. మార్కెట్‌కు 115 వాహనాల్లో 645 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. మో డల్‌ ధర రూ.8,900, కనిష్టధర రూ.8,700కు వ్యాపారులు కొనుగోలు చేశారు. క్రయ విక్రయాలను మార్కెట్‌ చైర్‌పర్సన్‌ పూల్లూరి స్వప్న, ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్‌–2 కార్యదర్శి రాజా పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement