జిల్లావ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మహాశక్తి ఆలయంలో అమ్మవారు రెండోరోజు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. చంద్రఘట్ట గాజులతో అలంకరణ చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ లింగార్చనలో పాల్గొని అభిషేకం చేశారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేశ్ సహా పలువురు నాయకులు అమ్మవారిని దర్శించుకున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం దాండియా ఆటలు ఆడారు. టవర్ సర్కిల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన దుర్గామాత సన్నిధిలో సీతారామచంద్రుల కల్యాణం వైభవంగా నిర్వహించారు. –కరీంనగర్ కల్చరల్
అభిషేక పూజల్లో కేంద్రమంత్రి సంజయ్‌కుమార్
టవర్‌సర్కిల్‌లో సీతారాముల కల్యాణం


