మెజార్టీ గ్రామాల్లో ఉప సర్పంచులను సర్పంచులు చులకనగా చూస్తున్నారు. చెక్ పవర్ విషయంలో యథాస్థితి కొనసాగించాలి. 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఉపసర్పంచ్‌లకు పూర్తిస్థాయి అధికారాలు ఇవ్వాలి.
– దుస్స కుమార్,
ఉప సర్పంచుల ఫోరం రాష్ట్ర అధికార ప్రతినిధి
గ్రామాల్లో అభివృద్ధికి సర్పంచ్, ఉపసర్పంచ్‌లు సహకరించాలి. ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకోవాలి. చెక్కులపై సంతకాలు చేయని ఉపసర్పంచ్‌లపై ఫిర్యాదులు చేస్తే పూర్తిస్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. గ్రామాల్లో పనులు వేగవంతమయ్యేలా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలి. – జగదీశ్వర్, డీపీవో


