కరీంనగర్‌స్పోర్ట్స్: జిల్లా స్థాయి పాఠశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో జరుగుతున్న 70వ జిల్లా స్థాయి ఎస్జీఎఫ్ క్రీడోత్సవాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. గురువారం అండర్– 14 బాలికలకు ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ పోటీలు నిర్వహించారు. అంతకుముందు పోటీలను జిల్లా యువజన క్రీడాశాఖ అధికారి శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి గసిరెడ్డి జనార్ధన్‌రెడ్డి ప్రారంభించారు. శుక్రవారం అండర్– 17 బాలురకు ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ పోటీలు నిర్వహిస్తామని ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి బన్సిలాల్ తెలిపారు. కవ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష కార్యదర్శులు బాబు శ్రీనివాస్, ఆడెపు శ్రీనివాస్, అంతటి శంకరయ్య, ఎస్జీఎఫ్ మాజీ కార్యదర్శి వేణుగోపాల్, పోతన శ్రీనివాస్, నరసయ్య, గిన్నె లక్ష్మణ్, వీరన్న, వంగపల్లి సూర్యప్రకాష్, బిట్ర శ్రీనివాస్, యూనిష్ పాష, కొమురోజు కృష్ణ, చందా శ్రీనివాస్, ఎల్వీ రమణ, బాలసాని రాజకుమార్, దత్తాత్రేయ పాల్గొన్నారు.
అండర్–14 బాలికల విజేతలు
ఖోఖో పోటీల్లో గంగాధర మండలం ప్రథమ, తిమ్మాపూర్ మండలం ద్వితీయ, కబడ్డీలో జమ్మికుంట మండలం ప్రథమ, కరీంనగర్ అర్బన్ మండలం ద్వితీయ, వాలీబాల్‌లో కొత్తపల్లి మండలం ప్రథమ, శంకరపట్నం మండలం ద్వితీయ స్థానంలో నిలిచాయి.


