పువ్వుల పేర్లతో పొడుపు కథలు | - | Sakshi
Sakshi News home page

పువ్వుల పేర్లతో పొడుపు కథలు

May 29 2026 2:43 AM | Updated on May 29 2026 2:43 AM

పువ్వుల పేర్లతో పొడుపు కథలు

1. అమెరికాకు చెందిన పువ్వు

విషపూరితమైన పువ్వు

స్పాడిక్స్‌ ఉన్న పుష్పగుచ్ఛం

ఆరేసి కుటుంబ పువ్వు

2. పువ్వులన్నీ సువాసన ఇస్తాయి

కానీ ఈ పువ్వు వస్త్రాలనిస్తుంది

3. ఈ పువ్వు జడలో పెట్టుకోలేము

ఈ పువ్వు కాశ్మీరులో ఉంటుంది

ఈ పువ్వు తినడానికి వాడతాము

4. ఆకుల రంగులో ఉండే పువ్వు

ఘాటైన సెంటు కొట్టుకునే పువ్వు

5. బురదలో ఉన్న స్వచ్ఛంగా ఉంటుంది

గుండ్రని ఆకులతో నీటిలో ఉంటుంది

నెలంబోనేసి కుటుంబంలో ఉంటుంది

6. భారతదేశంలోనే అరుదైన పుష్పం

పుష్కరానికోసారి పూసే పువ్వు

పశ్చిమ కనుమలలో పెరిగే పుష్పం

7. నైట్‌క్వీన్‌ బిరుదు కలిగిన పువ్వు

ధనికమైనదని పేరు కలిగిన పువ్వు

మెక్సికో దేశపు కాక్టస్‌ జాతి పువ్వు

8. లేత నారింజ రంగులో డిస్క్‌ పువ్వు

వీల్‌పిన్‌ కుషన్‌ అనే పేరున్న పువ్వు

అంతరించి పోతున్న దక్షిణాఫ్రికా పువ్వు

9. లిల్లీ పూలకు అక్కలు

వసంతంలో పూచే పువ్వులు

ఆకర్షణీయమైన రంగులు

అత్యంత విలువైన పువ్వులు

10. ఉత్తరాఖండ్‌ రాష్ట్ర పుష్పం

పోస్టల్‌స్టాంప్‌ ఉన్న పుష్పం

ఆస్టరేసి కుటుంబ పుష్పం

11. టెన్నిస్‌ బంతుల్లాంటి పువ్వులు

హరిప్రియ పేరు గల పువ్వులు

సుగంధ ద్రవ్యాలలో వాడే పువ్వులు

12. భూమ్మీదే అరుదైన పువ్వు

ప్రేమ అభిరుచి కలగలసిన పువ్వు

యూకే, న్యూజిలాండ్‌ల్లోని పువ్వు

13. కరేబియాన్‌ దీవులు, దక్షిణ అమెరికా పువ్వు

రేకులు ఔషధంగా ఉపయోగించే పువ్వు

ఫాబేసి కుటుంబానికి చెందిన పువ్వు

పగడపు రత్నం అనే బిరుదు గల పువ్వు

14. దుర్వాసన కలిగిన పువ్వు

శవం పువ్వని పేరున్న పువ్వు

మలేషియా, థాయ్‌లాండ్‌ల పువ్వు

ప్రపంచంలోనే అతి పెద్ద పువ్వు

15. సుమత్రా ద్వీపానికి చెందిన పువ్వు

కుళ్లిన చేప వాసన కలిగిన పువ్వు

ఆరేసి కుటుంబానికి చెందిన పువ్వు

16. వుల్ఫియా గ్లోబోసా శాసీ్త్రయ నామం

ప్రపంచంలోనే అత్యంత చిన్న పుష్పం

ప్రాకాశవంతమైన ఆకుపచ్చ రంగు పుష్పం

17. పాముపడగ ఆకారంలో ఉండే పువ్వు

పేరులో శాంతిని పెట్టుకున్న పువ్వు

శ్రీస్పాతి ఫిలమ్‌శ్రీ పేరున్న శ్రీఆరేసిశ్రీ పువ్వు

18. తెల్లగా దెయ్యంలా ఉండే పువ్వు

ఆకులు, కాండం లేకుండా ఉన్న పువ్వు

అంతరించి పోతున్న ఆర్కిడెని పువ్వు

19. పుష్పించే అరుదైన పుదీనా జాతి పువ్వు

తీవ్రమైన ప్రమాదంలో ఉన్న పువ్వు

క్లేలెన్సులు అనే పేరు గల పువ్వు

20. మధ్య అమెరికాకు చెందిన పువ్వు

అంతరించిపోయే దశలో ఉన్న పువ్వు

గాలిమొక్కలుగా పేరు పొందిన పువ్వు

బలం, అనుకూలతల మిళిత పువ్వు

21. పాపారేసి కుటుంబానికి చెందిన పువ్వు

ఆసియన్‌ బ్లీడింగ్‌ హార్ట్‌ అని పేరున్న పువ్వు

కొండల్లో రాతి పగుళ్లలో పెరిగే పువ్వు

22. హిమాలయ ప్రాంతపు అరుదైన పువ్వు

మెకోనోప్సిన్‌ ఆక్యులేటా శాసీ్త్రయ నామం

నీలపురంగు రెక్కలు పసుపు కేసరాల పుష్పం

23. ఆడపిల్లల చెప్పును పోలి ఉండే పువ్వు

భారతీయపు అరుదైన సున్నితమైన పువ్వు

అంతరిస్తున్న కారణంగా రక్షింపబడే పువ్వు

24. రసవంతమైన పుష్పించే మొక్క

రంగులతో అలంకార మొక్క

కళ్లు మిరుమిట్లు గొలిపే మొక్క

25. ఇంద్రధనస్సు వర్గాలతో పూలు

ఎక్కువసేపు వాడిపోని పూలు

రాముంటిక్‌ ఫ్లవరోగా పేరున్న పూలు

అదృష్టం, సామరస్యాలకు చిహ్నాలు

జావాబులు:

1.ఆంధూరియా,

2.పత్తి పువ్వు,

3.కుంకుమ పువ్వు,

4.సంపెంగ పువ్వు,

5.తామర పువ్వు,

6.నీలకురించి,

7.కడుపుల్‌ పువ్వు,

8.కధారిన్‌ పువ్వు,

9.తులిప్‌ పూలు,

10. బ్రహ్మకమలం,

11.కదంబ పూలు,

12.మిడిల్‌ మిస్ట్‌ రెడ్‌ పువ్వు,

13.చిలక ముక్కు పువ్వు,

14.రఫ్లీషియా,

15.టైటాన్‌ ఆరమ్‌ కారియన్‌ పువ్వు (అమారో ఫాలాస్‌ టైటానియమ్‌),

16.వాటర్‌ మీల్‌ పువ్వు,

17.్చీపస్‌ లిల్లీ,

18.ఘోస్ట్‌ ఆర్కిడ్‌,

19.అకాంతోమింతాం ఇలిసిఫోలియా (శాన్‌ డియాగో ధోర్న్‌ మింట్‌),

20.టిల్లాడ్సియా,

21.లాంప్రో కాప్నోస్‌ పువ్వు,

22.హిమాలయన్‌ బ్లూపాపి,

23.లేడిస్‌ స్లిప్పర్‌ ఆర్కిడ్‌

డాక్టర్‌ కందేపి రాణిప్రసాద్‌

మేనేజింగ్‌ డైరెక్టర్‌, సృజన్‌

చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌, సిరిసిల్ల

Advertisement
 
Advertisement
Advertisement